
హైదరాబాద్: మరికొన్ని గంటల్లో 18వ ఆసియా క్రీడల సంరంభానికి తెరలేవనుంది. ఇండోనేషియా ఆతిథ్యమిస్తోన్న ఈ ఆసియా క్రీడలు శనివారం (ఆగస్టు 18)న రాజధాని జకార్తాలోని GBK ప్రధాన స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనున్నాయి.
ఈ క్రీడా సంరంభానికి హాజరవుతోన్న 11వేల మంది అథ్లెట్లు, 5వేల మంది అధికారులకు జకర్తా, పాలెంబాగ్‌లు ఆతిథ్యమివ్వనున్నాయి. గురువారం క్రీడా గ్రామంలో భారత్ తరఫున పాల్గొంటున్న పలువురు అథ్లెట్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

ఇప్పటికే జకార్తాకు చేరుకున్న భారత హాకీ పురుషుల జట్టుతోపాటు రెజ్లర్లు అతి సాధారణంగా జరిగిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భారత ఉన్నతాధికారులు పాల్గొని భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు అందజేశారు.
ఆసియా క్రీడల ప్రారంభ వేడుకల శనివారం సాయంత్రం 5:30 గంటలకు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ ప్రారంభ వేడుకలను భారత్‌లో సోనీ టెలివిజన్ ప్రసారం చేయనుంది. 6:15 గంటలకు అథ్లెట్ల పరెడ్ ప్రారంభమవుతుంది. భారత తరుపున ఆసియా క్రీడల్లో పతాకధారిగా(ఫ్లాగ్‌బేరర్) నీరజ్ వ్యవహరించనున్నాడు.
ఆసియా గేమ్స్ ఏర్పాట్లపై పాలెంబాగ్ నివాసి నికీ ఆంగ్రెయిని మాట్లాడుతూ "ఆసియా గేమ్స్ హడావుడి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మ్యూరల్స్ ఆకట్టుకుంటున్నాయి. లైట్ రైల్ తిరుగుతోంది. ఇక క్రీడలు ఆరంభమే తరువాయి" అని ఆనందంగా చెప్పింది. స్థానికులు సైతం "క్రీడల్ని కచ్చితంగా తిలకిస్తాం. ఇక ఎదురు చూడటం మావల్ల కాదు" అంటున్నారు.

ఆసియా గేమ్స్ ప్రారంభ వేడుకలకు సంబంధించి పూర్తి సమాచారం:
Venue: Gelora Bung Karno Main Stadium, Jakarta
Time: 5:30 PM (IST)
TV Channel: Sony Ten 1, Sony Ten 2, Sony ESPN
Live-streaming: Sony Liv
ఈ ప్రారంభ వేడుకల్లో ఇండోనేషియాకు చెందిన పాపులర్ సింగర్లు ఆంగ్గూన్, రైసా, తులుస్, ఇడు కొండోలోగిట్, పుత్రి ఆయు, ఫతీన్, వియా విల్లాన్‌లు తమ ప్రదర్శనతో సందడి చేయనున్నారు. ఈ 18వ ఆసియా గేమ్స్‌కు ఇండోనేషియా పెట్టిన స్లోగన్ 'ఎనర్జీ ఆఫ్ ఆసియా'.

ప్రారంభ వేడుకల్లో ఇండోనేషియా సంస్కృతి ఉట్టిపటేలా సాంస్కృతిక కార్యక్రమాలను సిద్ధం చేసినట్లు నెట్ టెలివిజన్ సీఈఓ విశ్వుతమా వెల్లడించారు. ప్రారంభ వేడుకలకు 120 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పు, 26 మీటర్ల ఎత్తుతో కూడిన వినూత్నమైన స్టేజిని నిర్వాహుకలు సిద్ధం చేశారు.
స్టేజి వెనుక ఇండోనేషియా దేశ అందాలు ప్రతిబంబించేలా తీర్దిదిద్దారు. ఇందులో భాగంగా చెట్లు, పూలు, వాటర్ పాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టేజిపై మొత్తం 4000 మంది డ్యాన్సర్లు డ్యాన్స్ చేయనున్నారు.