Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్క్వాష్: మలేసియాను ఓడించి ఫైనల్‌కు చేరిన పల్లికల్ బృందం

Asian Games 2018: India womens Squash team beats Malaysia to reach final

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భాగంగా స్క్వాష్‌ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప‍్రవేశించింది. శుక‍్రవారం జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2-0 తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ మలేసియాను ఓడించి ఫైనల్‌కు చేరింది.

జోష్న చిన్నప్ప, దీపికా పల్లికల్‌, సునయనా కురువిల్లా, తాన్వి ఖన్నాతో కూడిన భారత మహిళల స్క్వాష్‌ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిక్యాన్నికనబరిచిన భారత మహిళల స్వ్కాష్ జట్టు ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది.

దీంతో భారత మహిళల స్క్వాష్‌ జట్టు కనీసం రజతాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగే స్వర్ణ పోరులో హాంకాంగ్‌ లేదా జపాన్‌ల మధ్య జరుగనున్న రెండో సెమీ ఫైనల్‌ విజేతతో భారత్‌ తలపడనుంది. మరోవైపు శుక్రవారం భారత పురుషుల జట్టు స్క్వాష్‌ సెమీ ఫైనల్‌లో హాంకాంగ్‌తో ఆడనుంది.

Story first published: Friday, August 31, 2018, 15:05 [IST]
Other articles published on Aug 31, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+