ఆసియా గేమ్స్: ఈక్వెస్టియాన్ విభాగంలో భారత్‌కు రెండు పతకాలు

జకార్తా: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడా సంరంభంలో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఎనిమిదో రోజు భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. ఈక్వెస్ట్రియన్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో భారత ఆటగాళ్లు 2 రజత పతకాలు సాధించారు. ఈక్వెస్ట్రియన్ వ్యక్తిగత విభాగంలో ఫావుద్ మిర్జా 26.40 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. ఇది ఆసియా క్రీడల్లో భారత్‌కు 30వ పతకం.
ఇక టీమ్ విభాగంలో రాకేశ్ కుమార్, ఆశీష్ మాలిక్, జితేందర్ సింగ్, ఫావుద్ మిర్జాలతో కూడిన భారత జట్టు రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ విభాగంలో జపాన్ తొలి స్థానంలో నిలవగా.. థాయ్‌లాండ్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తాజా పతకాలతో ఆసియా క్రీడల్లో భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 31(7 స్వర్ణాలు, 7 రజతాలు, 17 కాంస్యాలు)కి చేరాయి.
ఈక్వెస్ట్రియాన్ ఈవెంట్లో భారత్ 1982 తర్వాత పతకం సాధించడం ఇదే తొలిసారి. భారత స్వర్ణ విజేతతో పాటుగా జపాన్‌కు చెందిన ఒవియా ఒషియాకి 22.70 పాయింట్లతో స్వర్ణాన్ని సాధించగా.. చైనాకు చెందిన అలెక్స్ టియాన్ హువా 27.10 పాయింట్లతో కాంస్యాన్ని దక్కించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications