
జకార్తా: ఇండోనేషియా నగరాలైన జకార్తా, పాలెమ్‌బాంగ్‌లలో జరుగుతున్న 18వ ఏషియన్ గేమ్స్‌లో ఇండియా ఖాతా తెరిచింది. ఆసియా క్రీడల షూటింగ్ విభాగంలో భారత షూటర్లు అపూర్వీ చండేలా, రవికుమార్ ఫైనల్‌లో విజయం సాధించారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ విభాగంలో ఈ జంట మొత్తం 835.3 స్కోరుతో ఫైనల్‌కి చేరి స్వర్ణ పతకంపై ఆశలను పెంచింది.
క్వాలిఫికేషన్స్ రౌండ్‌లో కొరియా తర్వాత రెండోస్థానంలో నిలిచి ఫైనల్‌కు వెళ్లిన ఇండియన్ జోడీ.. ఫైనల్లోనూ సిల్వర్ మెడల్ గెలిచేలా కనిపించింది. రెండోస్థానం కోసం చైనాతో పోటీ పడింది. ఒకే షాట్ మిగిలి ఉన్న సమయంలో రెండు టీమ్స్ ఒకే స్కోరు సాధించాయి. ఈ సమయంలో చివరి షాట్‌కు ఇండియాకు 9.7 పాయింట్లు మాత్రమే వచ్చాయి. దీంతో చైనా సిల్వర్ మెడల్, చైనీస్ తైపీ గోల్డ్ మెడల్ గెలుచుకోగా.. ఇండియా బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకుంది.
చైనీస్ తైపీ టీమ్ ఏషియన్ గేమ్స్ రికార్డు స్కోరు 494.1తో గోల్డ్ మెడల్ గెలవడం విశేషం. ఏషియన్ గేమ్స్ ఎయిర్‌రైఫిల్‌లో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌ను ప్రవేవపెట్టడం ఇదే తొలిసారి. అందులోనే ఇండియాకు కాంస్య పతకం వచ్చింది.