For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా గేమ్స్: భారత పతక విజేతలు వీరే

By Nageshwara Rao
Asian Games 2018: Indias medal winners so far

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో పలువురు భారత క్రీడాకారులు పతకాలు సాధించి దేశానికే గర్వకారణంగా నిలిచారు. ఆసియా గేమ్స్ ప్రారంభమైన తొలిరోజు నుంచే భారత క్రీడాకారులు తమ పతకాల వేటను ఆరంభించారు. అత్యంత ప్రతిష్టాత్మక ఏషియాడ్ వేదికపై భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

రెజ్లింగ్, షూటింగ్, వుషు విభాగాల్లో పలువురు క్రీడాకారులు పతకాలు సాధించి పతకాల పట్టికలో భారత్‌ను టాప్-5లో నిలబెట్టారు. భారత్ ఖాతాలో ఎక్కువగా కాంస్య పతకాలే ఉండటం విశేషం. తొలి నాలుగు రోజుల పోటీల్లో రెజర్లు, షూటర్లు కలిపి భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు అందించారు.

బజ్‌రంగ్ పూనియా, వినేష్ ఫోగట్, సౌరభ్ చౌదరి, రాహి సర్నోబత్‌‌లు‌ మాత్రమే ఇప్పటివరకు స్వర్ణ పతకాలను సాధించారు. మిగతా విభాగాల్లో ఒక్క షూటర్లు మాత్రమే 9 పతకాలను సాధించి పెట్టారు. భారత్‌లో అంతగా ప్రాచుర్యం లేని వుషు గేమ్‌లో భారత్‌ ఒక్క రోజే 4 కాంస్య పతకాలు వచ్చాయి.

ఇండోనేషియా రాజధాని జకార్తాతో పాటు పాలెంబాంగ్‌లో జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత్‌కు షూటర్లు అపూర్వి చండేలా, రవి కుమార్‌‌ తొలి పతకం అందించగా.... తొలి గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుడిగా రెజ్లర్ భజరంగ్ పూనియా అరుదైన ఘనత దక్కించుకున్నాడు.

ఐదో రోజు విజేతలు:
* పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో శార్ధూల్ విహాన్‌ రజత పతకం సాధించాడు.
* మహిళల ఉమెన్స్ సింగిల్స్‌లో అంకిత రైనాకు కాంస్య పతకం దక్కింది.

నాలుగో రోజు విజేతలు :
* మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో రాహి సర్నోబత్‌ స్వర్ణ పతకం సాధించింది.
* మహిళల 60 కేజీల శాండా ఈవెంట్‌లో రొషిబినా దేవి కాంస్య పతకం సాధించింది.
* పురుషుల 56 కేజీల ఈవెంట్‌లో సంతోష్ కుమార్ కాంస్య పతకం దక్కించుకున్నాడు.
* పురుషుల 65 కేజీల శాండా ఈవెంట్‌లో నరేందర్ గ్రేవాల్ రజత పతకం సాధించాడు .
* పురుషుల 60 కేజీల ఈవెంట్‌లో సూర్య భాను ప్రతాప్ సింగ్ కాంస్య పతకం నెగ్గాడు.

మూడో రోజు విజేతలు :
* 10 మీ ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో సౌరభ్ చౌదరి స్వర్ణ పతకం సాధించాడు.
* 10 మీ ఎయిర్ పిస్టల్ షూటింగ్‌లో అభిషేక్‌ వర్మ కాంస్య పతకం సాధించాడు.
* పురుషుల 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్స్ షూటింగ్‌లో సంజీవ్ రాజ్‌‌పుత్‌ రజతం సొంతం చేసుకున్నాడు.
* సెపక్ తక్రా రెగు ఈవెంట్‌లో భారత మెన్స్ జట్టు కాంస్యం సొంతం చేసుకుంది.
* మహిళల 68 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో దివ్య కాక్రన్ కాంస్య పతకం నెగ్గింది.

రెండో రోజు విజేతలు :
* 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో దీపక్ కుమార్‌ రజత పతకం నెగ్గాడు.
* పురుషుల ట్రాప్ షూటింగ్‌లో లక్షయ్ రజతం సొంతం చేసుకున్నాడు.
* మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో వినేష్ ఫోగట్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది.

తొలి రోజు విజేతలు :
* 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌‌లో అపూర్వి చండేలా,రవి కుమార్‌ కాంస్యం సొంతం చేసుకున్నారు.
* పురుషుల 65 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్‌లో బజ్‌రంగ్ పూనియా స్వర్ణం సాధించాడు.

Story first published: Thursday, August 23, 2018, 16:10 [IST]
Other articles published on Aug 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+