ఆసియా గేమ్స్: నెమ్మదించిన హిమదాస్, మిక్స్‌డ్ రిలేలో చేజారిన స్వర్ణం

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జురుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో అంచనాలను నిజం చేస్తూ భారత అథ్లెట్ల తమ జోరుని కొనసాగిస్తున్నారు. ఆసియా గేమ్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్‌డ్ 4×400 ఈవెంట్‌లో భారత జట్టు రజత పతకం గెలుచుకుంది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
మొహమ్మద్ అనస్ యహియా, పూవమ్మ, హిమ దాస్, అరోకియా రాజీవ్‌లతో కూడిన భారత జట్టు మూడు నిమిషాల 15.71 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. తొలి లెగ్‌లో అనస్ అద్భుతంగా పరుగెత్తి ముందంజలో నిలవగా, పూవమ్మ దానిని కొనసాగించింది.
మూడో లెగ్‌లో ప్రత్యర్థితో పోలిస్తే హిమ దాస్ బాగా నెమ్మదించిపోయింది. బహ్రెయిన్ అథ్లెట్ అడెకోయా తన సహచరి సల్వా నాసర్‌కు బ్యాటన్ అందిస్తూ ట్రాక్‌పై పడిపోవడంతో ఆమెను తప్పించుకుంటూ తనను తాను నియంత్రించుకునే క్రమంలో హిమ దాస్ వేగం తగ్గించాల్సి వచ్చింది.
చివరి లెగ్‌లో రాజీవ్ తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. దాంతో భారత బృందం రజతంతోనే సంతృప్తి పడింది. మరోవైపు, ఈ ఈవెంట్‌లో బహ్రెయిన్ (3 నిమిషాల 11.89 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా... కజకిస్తాన్ (3 నిమిషాలు 19.52 సెకన్లు) కాంస్యం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications