
జకార్తా: ఆసియా క్రీడల్లో భారత సెపక్ తక్రా జట్టు సంచలనం సృష్టించింది. చరిత్రలో తొలిసారి దేశానికి పతకం ఖాయం చేసింది. క్వార్టర్ ఫైనల్లో ఇరాన్‌ను 21-16, 19-21, 21-17 తేడాతో ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్ చేరిన జట్లకు గెలుపోటములతో సంబంధం లేకుండా కాంస్య పతకాలు అందజేస్తారు. అంతకు ముందు జరిగిన పురుషుల బృంద ప్రిలిమినరీ గ్రూప్-బి రెండో పోరులో ఇండోనేసియా చేతిలో భారత్ 0-3 తేడాతో ఓడింది. తొలి మ్యాచ్ గెలవడంతో క్వార్టర్స్ చేరడం గమనార్హం.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
'భారత్‌ది చారిత్రక ప్రదర్శన. ఆసియా క్రీడల్లో తొలిసారి సెపక్ తక్రాలో పతకం గెలిచాం' అని భారత సెపక్ తక్రా సమాఖ్య కార్యదర్శి యోగేంద్ర సింగ్ దహియా మీడియాకు తెలిపారు. సెపక్ తక్రా అచ్చం వాలీబాల్ తరహాలో ఉంటుంది. బంతిని అవతలి కోర్టులోకి పాస్ చేసేందుకు కాళ్లు, భుజాలు, తల, మోకాళ్లు మాత్రమే ఉపయోగించాలి. చేతులతో ఆడేందుకు అనుమతి లేదు. మహిళల సెపక్ తక్రా జట్టు వరుసగా రెండు మ్యాచుల్లో ఓడటంతో క్వార్టర్స్ చేరలేదు.
షూటింగ్:
అభిషేక్ శర్మ, సౌరభ్ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్; ఉ.గం. 8 నుంచి; ఫైనల్స్ 9.45 నుంచి). లక్షయ్, శ్రేయసి సింగ్ (ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ క్వాలిఫయింగ్; ఉ.గం. 8.30 నుంచి; ఫైనల్స్ మ.గం. 3 నుంచి).
కబడ్డీ (మహిళల విభాగం):
భారత్(vs) శ్రీలంక, (ఉ.గం. 8 నుంచి); భారత్(vs)ఇండోనేసియా, (ఉ.గం. 11.20 నుంచి); పురుషుల విభాగం: భారత్(vs)థాయ్‌లాండ్ (సా.గం. 4 నుంచి).
జిమ్నాస్టిక్స్:
దీపా కర్మాకర్, ప్రణతి దాస్, అరుణా రెడ్డి, మందిర, ప్రణతి నాయక్ (క్వాలిఫయింగ్; మ.గం. 2.30 నుంచి).
రెజ్లింగ్:
పురుషుల గ్రీకో రోమన్ స్టయిల్ (జ్ఞానేందర్-60 కేజీలు; మనీశ్-67 కేజీలు); మహిళల ఫ్రీస్టయిల్ (దివ్య కక్రాన్-68 కేజీలు; కిరణ్-72 కేజీలు; మ.గం. 12 నుంచి రాత్రి 7 వరకు).