
జకార్తా: ఆసియా క్రీడల్లో భారత్‌కు సోమవారం మరో రజతం లభించింది. పురుషుల 400 మీటర్ల హార్డిల్స్ ఫైనల్లో అయ్యస్వామి ధరుణ్ రెండో స్థానంలో నిలిచాడు. 48.96 సెకన్లలో పరుగు పూర్తిచేసి వెండి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తన కెరీర్‌లో అయ్యస్వామికి ఇదే అత్యుత్తమ టైమింగ్ కావడం గమనార్హం. ఖతార్‌కు చెందిన సాంబా అబ్దుర్ రెహ్మాన్ 47.66 సెకన్లతో ఆసియా గేమ్స్ రికార్డు సాధించాడు.
జపాన్ క్రీడాకారుడు అబే టకతోషి కాంస్యం అందుకున్నాడు. భారత్‌కు చెందిన తమిళరసన్ సంతోష్ కుమార్ 49.66 సెక్లనతో ఐదో స్థానంలో నిలిచాడు.