డెంగ్యూతో ఆసియా గేమ్స్‌కు దూరం కానున్న క్రీడాకారిణి

న్యూ ఢిల్లీ: భారత అగ్రశ్రేణి ఆర్చరీ క్రీడాకారిణి దీపిక కుమారి ఆసియా గేమ్స్‌లో పాల్గొనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం దీపిక డెంగ్యూ జ్వరంతో బాధపడుతోంది. షెడ్యూల్ ప్రకారం దీపిక బుధవారం జట్టు సభ్యులతో కలిసి జకార్తా బయలుదేరాలి. కానీ, జ్వరం కారణంగా ఆమె వెళ్లలేకపోయింది. ఈ నెల 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేషియాలో ఆసియా గేమ్స్ జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఆటగాళ్లు షెడ్యూల్ ప్రకారం అక్కడికి బయలుదేరుతున్నారు. ఆగష్టు నెల 22 నుంచి ఆర్చరీ ఈవెంట్‌లో పోటీలు ప్రారంభంకానున్నాయి. 'గత వారం రోజుల నుంచి దీపిక డెంగ్యూతో బాధపడుతోంది. అందుకే మిగతా జట్టుతో కలిసి వెళ్లలేకపోయింది. శుక్రవారం దీపిక ఇండోనేషియా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాం. ఆమె కోలుకోవడమే తరువాయి' అని జట్టు మేనేజ్‌మెంట్ సభ్యులు తెలిపారు. దీపిక ఆగష్టు 22న ఆటను దాస్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో పోటీ పడాల్సి ఉంది. ఈవెంట్‌లో పతకం సాధించే సత్తా ఉండటంతో వీరిపై ఇప్పటివరకూ భారీ ఆశలే పెట్టుకున్నారు.
ఆసియా క్రీడల్లో దీపిక పతకం సాధిస్తోందని అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇప్పుడు దీపిక ఆ పోటీల్లో పాల్గొనడంపైనే అనుమానాలు నెలకొన్నాయి. దీపిక త్వరగా కోలుకుని పోటీల్లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు. అనారోగ్యంతో దీపిక ఇలా పోటీలకు దూరమవ్వడం ఇదే తొలిసారి కాదు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో జ్వరం బాధపడుతూ పోటీలో పాల్గొంది. మెరుగైన ప్రదర్శన చేయలేకపోవడంతో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జపాన్ క్రీడాకారులతో పాటు.. ఏటా స్వర్ణాధిక్యంతో ఇంటికి వెళ్తున్న చైనా భారత్ జట్లు కూడా జకార్తా చేరుకున్నాయి. ఈ ఈవెంట్‌లో ఇప్పటికే
కొన్ని పోటీలు మొదలైయ్యాయి. రెండు రోజుల ముందు జరిగిన హ్యాండ్ బాల్ పోటీలో అయితే భారత క్రీడాకారులు యూనిఫామ్‌లు లేకుండానే బరిలోకి దిగాల్సిన దుస్థితి ఏర్పడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications