
జకార్తా: ఆసియా క్రీడా సంరంభంలో రెండో రోజైన సోమవారం భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల 10మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో షూటర్ దీపక్ కుమార్‌కు సిల్వర్ పతకం దక్కింది. దీపక్ 247.7 పాయింట్లతో రెండో స్థానంలో పోటీని ముగించాడు. ఈ పోటీలో చైనాకు చెందిన హారన్ యాంగ్ 249.1 పాయింట్లతో గెలిచి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు.
ఇదే విభాగంలో తొలి రోజు పతకం సాధించిన అపూర్వి చండేలాల జోడి కంటే రవి కుమార్ దీప్ కుమార్ ఇంకా ఎక్కువ పాయింట్లు సాధించాడు.
2014 ఆసియా గేమ్స్‌లో దీపక్ కుమార్ స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో వ్యక్తిగత విభాగంలో రజితం సాధించుకున్నాడు. ఇదే కామన్వెల్త్ గేమ్స్‌లో చండేలా స్వర్ణాన్ని సాధించాడు. మరోవైపు కబడ్డీలో భారత పురుషుల, మహిళల జట్లు ఘనవిజయాలతో ముందంజ వేయగా, బ్యాడ్మింటన్‌లో పురుషుల జట్టు శుభారంభం చేసింది.
మహిళల హాకీ జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇండోనేషియాను 8-0 తేడాతో చిత్తు చేసింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించి నిరాశపరిచాడు. వాలీబాల్, హ్యాండ్‌బాల్, సెపక్‌తక్రా ఈవెంట్లలో భారత్‌కు ఓటములే మిగిలాయి. స్విమ్మర్లు సాజన్ ప్రకాశ్, నటరాజన్ ఫైనల్లో ఆకట్టుకోలేకపోయారు.