Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా గేమ్స్: సెమీస్‌కు చేరిన స్ప్రింటర్లు, క్వార్టర్స్‌కు సైనా

Asian Games 2018, Day 7: Track And Field Athletes Impress; Saina Nehwal In Quarters

హైదరాబాద్: ఇండోనేషియాలో జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల దిశగా సాగుతున్నారు. శనివారం జరిగిన ఫోటీల్లో భారత స్ప్రింటర్లు సెమీస్‌కు దూసుకెళ్లారు. ఆసియా చాంపియన్ మొహమ్మద్ అనాస్, అరోకియా రాజీవ్‌లు.. పురుషుల 400 మీటర్ల ఈవెంట్‌లో సెమీస్‌కు అర్హత సాధించారు.

ఈ ఇద్దరూ పోటీల్లో భాగంగా అథ్లెటిక్స్‌లో దూసుకుపోతున్నారు. 400మీటర్ల ఈవెంట్‌లో మొహమ్మద్ అనాస్‌కు జాతీయ రికార్డు కూడా ఉంది. శనివారం జరిగిన హీట్స్‌లో అతను 45.36 సెకన్లలో లక్ష్యాన్ని అందుకున్నాడు. నాలుగవ హీట్స్‌లో మరో స్ప్రింటర్ రాజీవ్ 46.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు.

శనివారం సాయంత్రం సెమీఫైనల్ రేస్ జరుగనుంది. మరోవైపు హైజంప్‌లో చేతన్ బాలసుబ్రమణ్యన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 2.15మీటర్ల ఎత్తును అతడు అలవోకగా దూకేశాడు.

క్వార్టర్ ఫైనల్లోకి సైనా నెహ్వాల్
మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పోటీల్లో భాగంగా శనివారం ఇండోనేషియాకే చెందిన ఫిట్రియానిపై 21-6, 21-14 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

Story first published: Saturday, August 25, 2018, 13:43 [IST]
Other articles published on Aug 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+