స్క్వాష్‌లో భారత్‌కు రెండో కాంస్యం: సెమీస్‌లో జ్యోష్న చిన్నప్ప ఓటమి

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు పతకాల వేటలో దూసుకుపోతున్నారు. శనివారం పోటీల్లో భాగంగా భారత్ స్క్వాష్‌లో రెండో పతకం సాధించింది. స్క్వాష్ మహిళల సింగిల్స్‌లో భారత్‌కు చెందిన జ్యోష్న చిన్నప్ప కాంస్య పతకం సాధించింది.
సెమీస్‌లో భాగంగా మలేసియాకు చెందిన సుబ్రమణియమ్ శివసంగరితో తలపడిన జ్యోష్న చిన్నప్ప 1-3తో ఓటమిపాలై కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. స్క్వాష్ పోటీల్లో భారత్‌కు ఇది రెండో పతకం కావడం విశేషం. అంతకముందు సెమీస్‌లోనే ఓడిన దీపికా పల్లికల్ కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే.
తాజా పతకంతో ఆసియా గేమ్స్‌లో భారత పతకాల సంఖ్య 27కు చేరింది. ప్రస్తుతం భారత ఖాతాలో 6 స్వర్ణ, 5 రజత, 16 కాంస్య పతకాలు ఉన్నాయి.
Story first published: Saturday, August 25, 2018, 16:12 [IST]
Other articles published on Aug 25, 2018
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications