Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ ఖాతాలో మరో పతకం: కాంస్యం నెగ్గిన దివ్య కాక్రన్

Asian Games 2018, Day 3: Wrestler Divya Kakran bags bronze

జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. మంగళవారం జరిగిన రెజ్లింగ్ పోటీల్లో మహిళల 68 కేజీల ప్రీ స్టైల్ విభాగంలో భారత్‌కు చెందిన దివ్య కాక్రన్ కాంస్యంలో మెరిసింది.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

చైనీస్ తైపీకి చెందిన తన ప్రత్యర్ధి చెన్ వెన్‌లింగ్‌పై సాంకేతికంగా 10-0తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ పోటీలో దివ్య కాక్రన్ 90 సెకన్లలో 10 పాయింట్లు సాధించడం విశేషం.

రెజ్లింగ్‌లో భారత్‌కు ఇది మూడో పతకం కావడం విశేషం. అంతకముందు పురుషుల విభాగంలో భజరంగ్ పూనియా, మహిళల విభాగంలో వినేశ్ ఫోగాట్‌లు స్వర్ణ పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.

దీంతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో 10 పతకాలు చేరాయి. ఇందులో 3 స్వర్ణాలు, 3 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి.

Story first published: Tuesday, August 21, 2018, 20:52 [IST]
Other articles published on Aug 21, 2018
Read in English: Divya Kakran bags bronze
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+