Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా గేమ్స్: రెండో స్వర్ణం, తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన ఫోగాట్

Asian Games 2018, Day 2: Wrestler Vinesh Phogat Wins Gold

జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. రెజ్లింగ్‌లో మహిళల 50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో వినేశ్ ఫోగాట్ స్వర్ణం సాధించింది. సోమవారం జరిగిన ఫైనల్లో జపాన్‌కు చెందిన ఇరి యుకిపై 6-2తేడాతో విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

ఆసియా గేమ్స్‌లో ఓ మహిళా రెజ్లర్ స్వర్ణం సాధించడం ఇదే తొలిసారి. తద్వారా ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళా రెజ్లర్‌గా వినేశ్ ఫోగాట్ చరిత్ర సృష్టించింది. గతంలో కామన్వెల్త్ గేమ్స్ ఆమె రెండు స్వర్ణ పతకాలను గెలుచుకుంది. మొత్తంగా చూస్తే ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం.

టోర్నీలో భారత్‌‌కి ఇది ఐదో పతకంకాగా.. మూడు పతకాలు షూటింగ్‌లో వచ్చాయి. ఫైనల్లో తొలి రౌండ్ నుంచే వినేేశ్ ఫోగాట్ అద్వితీయమైన ఆటతో ఆకట్టుకుంది. పోటీ ఆరంభంలోనే 4-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన వినేశ్ ఫొగాట్.. చివరి వరకూ పట్టు వదలకుండా ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. పోటీ మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందన్న దశలో చేసిన చిన్న తప్పిదాల కారణంగా.. రెండు పాయింట్లు ప్రత్యర్థికి ఇచ్చినప్పటికీ అప్పటికే ఫొగాట్‌కి పసిడి ఖాయమైపోయింది.

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని రెజ్లర్ భజరంగ్ పూనియా అందించిన సంగతి తెలిసిందే. 65 కేజీల పురుషుల విభాగంలో జపాన్‌కు చెందిన డాచీ తకాటాపై 11-8 తేడాతో పూనియా విజయం సాధించాడు. దీంతో యోగేశ్వర్‌దత్‌ (2014), కర్తార్‌సింగ్‌ (1978, 86), సత్పాల్‌సింగ్‌ (1982), రాజిందర్‌సింగ్‌ (1978), చంగ్డిసింగ్‌ (1970) తర్వాత ఏషియాడ్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారుడిగా భజరంగ్‌ నిలిచాడు.

అంతేకాకదు ఒకే ఏడాది కామన్వెల్త్‌, ఆసియా క్రీడల స్వర్ణాలు గెలిచిన భారత మూడో రెజ్లర్‌ భజరంగ్‌. ఈ ఆసియా గేమ్స్‌లో వినేశ్ ఫోగాట్ అసాధారణ ప్రదర్శన కనబరుస్తోన్న సంగతి తెలిసిందే. అంతకుముందు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో వినేశ్‌ ఫోగట్‌ 8-2 తేడాతో చైనా రెజ్లర్‌ యనన్‌ సున్‌పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది.

ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్లో ఫోగాట్ అద్భుత ప్రదర్శన చేసింది. క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన హుయుంగ్జో కిమ్‌పై సాంకేతికంగా 11-0తేడాతో నెగ్గింది. మరోవైపు భారత మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్‌, పింకీలకు నిరాశే ఎదురైంది. సాక్షి మాలిక్‌(62 కేజీల విభాగం) సెమీస్‌లో ఓడిపోగా, పింకీ(53కేజీలు) తొలి బౌట్‌లోనే నిష్క్రమించింది.

పూజ దండా( 57 కేజీలు) కూడా సెమీస్‌లో ఓడిపోయింది. దీంతో కాంస్య పతక పోరులో తలపడే మరో అవకాశం లభించింది. కాంస్య పతక పోరులో జపాన్‌ క్రీడాకారిణి సాకగామి కాట్సుకితో పూజా దండా తలపడనున్నారు.

Story first published: Tuesday, August 21, 2018, 15:23 [IST]
Other articles published on Aug 21, 2018
Read in English: Vinesh clinches Asiad gold
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+