Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా గేమ్స్: ముగింపోత్సవం అదిరిపోయింది.. 69 పతకాలతో భారత్

 Asian Games 2018 Closing Ceremony Highlights: Rani Rampal marches in with India’s flag

జకార్తా: 15 రోజుల పాటు అభిమానులను అలరించిన ఆసియా క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. ఆరంభం అదిరినట్లే... ముగింపు శోభ కనువిందు చేసింది. మొత్తానికి వేడుక ముగిసింది. వేదిక మురిసింది. అథ్లెట్లకు, అధికారులకు ఆతిథ్య ఇండోనేసియా బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలికింది. పతకాలు గెలిచిన అథ్లెట్లంతా గర్వంగా జకార్తాను వీడితే... పోరాడిన అథ్లెట్లు మళ్లీ లక్ష్యంపై స్ఫూర్తితో ముందుకు సాగారు.

జకార్తాలోని గెలొరా బంగ్‌ కర్నో స్టేడియంలో రెండు గంటల పాటు సాగిన ఈ ముగింపు వేడుక అందర్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రీడల చివరిరోజు ఆదివారం మిక్స్‌డ్‌ ట్రయాథ్లాన్‌ ఈవెంట్‌ జరిగింది. జపాన్‌ బృందం ఈ గేమ్స్‌ చివరి స్వర్ణాన్ని సాధించింది. ఇక వీడ్కోలు అంటూ ఇండోనేషియా సెలవు తీసుకోగా.. 2022 ఆసియా క్రీడలకు తాము సిద్ధం అంటూ హాంగ్జూ (చైనా) బ్యాటన్‌ అందుకుంది. ఆసియా స్ఫూర్తిని చాటేలా భారత్, చైనా, ఉభయ కొరియాలకు చెందిన కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ముగింపోత్సవంలో భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణీ రాంపాల్‌ జాతీయ జెండాను చేతబూని భారత బృందానికి ముందు కదిలింది. వేలాది మంది అభిమానుల సమక్షంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో ఇండోనేషియా సంప్రదాయ నృత్యాలు.. కళ్లుచెదిరేలా సాగిన లేజర్‌ షో ఆకట్టుకున్నాయి. సిద్ధార్థ్‌ సలాతియా, దెనాదా కోయి మిల్‌ గయా, కుచ్‌ కుచ్‌ హోతా హై, జై హో గీతాలు ఆలపించి రంజింపజేశారు.

 Asian Games 2018 Closing Ceremony Highlights: Rani Rampal marches in with India’s flag

రెండువారాల క్రితం ఆరంభోత్సవంలో ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడోడో బైక్‌ స్టంట్‌తో వేదికకు విచ్చేయగా... ఈసారి వీడియో సందేశంతో వచ్చారు. క్రీడాప్రపం చాన్ని ఉర్రూతలూగించిన ఈ గేమ్స్‌ను ఆస్వా దించిన వారికి ఆయన అభినందనలు తెలి పారు. ఈ వేడుకల్ని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాచ్, ఆసియా ఒలింపిక్స్‌ కౌన్సిల్‌ చీఫ్‌ అహ్మద్‌ అల్‌ ఫహాద్‌ స్టేడియంలోని వీఐపీ గ్యాలరీ నుంచి ప్రత్య క్షంగా వీక్షించారు. భారత్‌కు గత ఆసియా క్రీడలకంటే ఉత్తమైన ఆసియా క్రీడలివే. ఈసారి మన బృందం 15 స్వర్ణ, 24 రజత, 30 కాంస్య పతకాలతో సహా 69 పతకాలు సాధించింది.

Story first published: Monday, September 3, 2018, 9:28 [IST]
Other articles published on Sep 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+