For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గురువుకి మాటిచ్చా.. స్వర్ణంతోనే తిరిగొస్తానని.. : భజరంగ్ పూనియా

Asian Games 2018: Bajrang Punia Wins Indias First Gold
Asian Games 2018: Bajrang Punia Had Promised Gold Medal To Yogeshwar Dutt

జకార్తా: 18వ ఆసియా గేమ్స్‌లో భారత్ తరపున బరిలోకి దిగి తొలి రోజే స్వర్ణాన్ని అందించిన భజరంగ్ పూనియా సంతోషంలో మునిగితేలుతున్నాడు. క్రీడల నుంచి కచ్చితంగా స్వర్ణంతోనే తిరిగి వస్తానని వాళ్లు గురువుకు చెప్పాడట. చెప్పినట్లుగానే మాట నిలబెట్టుకున్నానని సగర్వంగా భావిస్తున్నాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లో భజరంగ్‌ 11-8తో టకాటని డైచి(జపాన్‌)ని ఓడించి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. ఒకే ఏడాదిలో కామన్వెల్త్‌, ఆసియా క్రీడల స్వర్ణాలు గెలిచిన యోగేశ్వర్‌ దత్‌, రాజిందర్‌సింగ్‌‌ల సరసన చేరిపోయాడు పునియా.

ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం

ఈ సందర్భంగా పునియా మాట్లాడుతూ...'ఆసియా క్రీడల్లో స్వర్ణంతో తిరిగి వస్తానని నా గురువు యోగేశ్వర్‌ దత్‌కు మాటిచ్చాను. ఇప్పుడు నా మాట నిలబెట్టుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. 2014 ఆసియా క్రీడల్లో యోగేశ్వర్‌ బంగారు పతకం సాధించారు. నా కెరీర్‌లో అతని ప్రభావం ఎంతో ఉంది. ఇదే ప్రదర్శన భవిష్యత్తుల్లోనూ కొనసాగిస్తే ఒలింపిక్స్‌లో పతకం గెలవడం ఖాయం. ప్రస్తుతం దృష్టంతా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పైనే ఉంచాను' అని పునియా చెప్పాడు.

అనంతరం సుశీల్‌ పరాజయం గురించి మాట్లాడుతూ... 'సుశీల్‌ కుమార్‌ దిగ్గజ ఆటగాడు. అతడు బరిలో ఉన్నాడంటే చాలు బంగారు పతకం ఆశించవచ్చు. కానీ, దురదృష్టవశాత్తూ అతడు తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. సుశీల్‌ ఓడిపోవడంతో నాతో పాటు మిగతా రెజ్లర్లు కూడా బాధపడ్డారు' అని పునియా తెలిపాడు.

తాను బంగారు పతకాన్ని అందుకున్న ఫొటోను పునియా ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు. 'ఆసియా క్రీడల్లో బంగారు పతకం. ఈ బంగారు పతకాన్ని మాజీ ప్రధాని, దివంగత వాజ్‌పేయీకి అంకితమిస్తున్నా' అని పునియా ట్విటర్లో పేర్కొన్నాడు.

Story first published: Monday, August 20, 2018, 17:24 [IST]
Other articles published on Aug 20, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+