
జకార్తా: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత్‌కి ఏడో పసిడి పతకం లభించింది. గేమ్స్‌లో ఏడోరోజైన శనివారం పురుషుల షాట్‌పుట్‌లో పోటీపడిన తేజిందర్‌పాల్ సింగ్ రికార్డు స్థాయిలో గుండుని 20.75 మీటర్లు విసిరి పసిడి పతకాన్ని గెలుపొందాడు. ఇలా అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం అందజేశాడు. దీంతో భారత్ ఖాతాలో 29వ పతకం చేరగా.. ఇందులో 7 స్వర్ణాలు, 5 రజతాలతో పాటు 17 కాంస్య పతకాలు ఉన్నాయి. ఐదో ప్రయత్నంలో అతడు ఈ ఘనత సాధించాడు.
తొలి ప్రయత్నంలో గుండును 19.96 మీటర్లు విసిరిన తజిందర్ రెండో ప్రయత్నంలో 19.15 మీటర్లు విసిరాడు. దీంతో ఒత్తిడికి గురైన తేజిందర్ మూడో ప్రయత్నంలో విఫలమయ్యాడు. కానీ.. నాలుగో ప్రయత్నంలో మాత్రం మళ్లీ 19.96 మీటర్లు విసిరి మునుపటి లయని అందుకుని.. ఐదోసారి కసితో ఆడి ఆసియా క్రీడల్లోనే రికార్డు నెలకొల్పేలా గుండును 20.75 మీటర్లు విసిరాడు. ఆరోసారి 20 మీటర్లకు పరిమితం అయ్యాడు.
చైనా ఆటగాడు లియూ యంగ్ 19.52 మీటర్లతో (సీజన్‌బెస్ట్) రజతం, కజకిస్థాన్ అథ్లెట్ ఇవనోవ్ ఇవాన్ 19.40తో కాంస్యం అందుకున్నాడు. శనివారం స్క్వాష్ పోటీలోనూ దీపిక పల్లికల్, జోష్న, సౌరభ్ ఘోశల్ కాంస్య పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. దీంతో.. శనివారం భారత్ ఖాతాలో మొత్తం నాలుగు పతకాలు చేరాయి.
స్వర్ణం గెలవడంకంటే కూడా తాను 21 మీటర్ల దూరాన్ని చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నానని తజిందర్ పాల్ చెప్పాడు. 'జాతీయ రికార్డు తిరగ రాసేందుకు గత రెండుమూడేళ్లుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. అది ఈరోజు నెరవేరింది. అదికూడా ఆసియా క్రీడల మీట్ రికార్డుతో కావడం సంతోషంగా ఉంది' అని పాల్ చెప్పాడు.