బాక్సింగ్‌లో మేరీ కోమ్‌కు బంగారు పతకం (పిక్చర్స్)
న్యూఢిల్లీ: దక్షిణ కోరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో బాక్సింగ్‌లో మేరీ కోమ్‌కు స్వర్ణం లభించింది. 48-51 కిలోల ఫ్లై వెయిట్ బాక్సింగ్ విభాగంలో జైనా షెకర్‌బెకోవా (కజకిస్దాన్)పై గెలిచి మేరీ కోమ్ బంగారు పతకం కైవసం చేసుకుంది.
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది ఏడవ బంగారు పతకం. మేరీ కోమ్‌ను ప్రియాంక చోప్రా తన ట్విట్టర్ వ్యాఖ్యల ద్వారా అభినందించారు. మేరీ కోమ్ స్వర్ణం సాధించారని, భారత గౌరవాన్ని నిలబెట్టారని, మనం ఏదైనా సాధించగలమని నిరూపించారని ఆమె అభినందించారు. మేరీ కోమ్ స్వర్ణం సాధించినట్లు వార్తలు వెలువడిన వెంటనే బుధవారం ప్రియాంక చోప్రా ట్విట్టర్‌లో అభినందించారు.
దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలోకి మరో కాంస్య పతాకం వచ్చి చేరింది. మహిళల హాకీ కాంస్య పతక పోటీలో జపాన్‌పై 2-1 గోల్స్ తేడాతో భారత్ నెగ్గింది. ఇప్పటి వరకు భారత్ ఖాతాలో మొత్తం 48 పతకాలు చేరాయి. 7- స్వర్ణం, 8- రజితం, 33- కాంస్య పతకాలు వచ్చాయి. పతకాల పట్టికలో భారత్ 10వ స్థానంలో ఉంది.

బాక్సింగ్‌లో మేరీ కోమ్‌కు బంగారు పతకం
దక్షిణ కోరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో బాక్సింగ్‌లో మేరీ కోమ్‌కు స్వర్ణం లభించింది.

బాక్సింగ్‌లో మేరీ కోమ్‌కు బంగారు పతకం
48-51 కిలోల ఫ్లై వెయిట్ బాక్సింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన తర్వాత తనయుడిని ముద్దాడుతున్న మేరీ కోమ్.

బాక్సింగ్‌లో మేరీ కోమ్‌కు బంగారు పతకం
48-51 కిలోల ఫ్లై వెయిట్ బాక్సింగ్ విభాగంలో జైనా షెకర్‌బెకోవా (కజకిస్దాన్)పై గెలిచి మేరీ కోమ్ బంగారు పతకం కైవసం చేసుకుంది.

బాక్సింగ్‌లో మేరీ కోమ్‌కు బంగారు పతకం
ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది ఏడవ బంగారు పతకం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications