
ఘనంగా ముగిసిన ఆసియా గేమ్స్
దక్షిణ కొరియాలోని గత 15 రోజులుగా జరిగిన సంబరం ముగిసింది. ఇంచియాన్‌లో అంగరంగ వైభవంగా 17వ ఆసియా గేమ్స్‌కు ముగింపు పలికారు.

ఘనంగా ముగిసిన ఆసియా గేమ్స్
ఈ ముగింపు వేడుకలకు ఇంచియాన్ ఏషియాడ్ స్టేడికయం వేదికైంది.

ఘనంగా ముగిసిన ఆసియా గేమ్స్
కొరియా సంస్కృతిక వైభవాన్ని చాటుతూ ప్రపంచ క్రీడాభిమానులకు పరిచయం చేస్తూ వేడుకలు సాగాయి.

ఘనంగా ముగిసిన ఆసియా గేమ్స్
ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) అధ్యక్షుడు షేక్ అహ్మాద్ ఫహాద్ అల్ సబా క్రీడల ముగింపును అధికారకంగా ప్రకటించారు. మరో నాలుగేళ్ల అనంతరం ఆసియాకు చెందిన యువకులు జకార్తాలో కలవాలని పిలుపునిస్తున్నాను అని అన్నారు.

ఘనంగా ముగిసిన ఆసియా గేమ్స్
సోదరభావంతో మనమంతా ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ ఇంచియాన్.. థ్యాంక్యూ కొరియా.. థ్యాంక్యూ ఆసియా అంటూ ఆయన ప్రసంగాన్ని ముగించారు.

ఘనంగా ముగిసిన ఆసియా గేమ్స్
ఆ తర్వాత ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ జెండా కిందికి దిగుతుండగా 45 దేశాల నుంచి వచ్చిన అథ్లెట్ల సమక్షంలో అధికారిక గీతంతో స్టేడియం మొత్తం ప్రతిధ్వనించింది.

ఘనంగా ముగిసిన ఆసియా గేమ్స్
స్టేడియంలో ఏర్పాటు చేసిన బారీ స్క్రీన్‌పై తాజా గేమ్స్‌లోని అథ్లెట్ల విజయాలు, పరాజయాలు, భావోద్వేగాలను ప్రేక్షకులకు మరోసారి ప్రదర్శించారు.

ఘనంగా ముగిసిన ఆసియా గేమ్స్
తొలి ఆసియా గేమ్స్‌కు చెందిన పతాకం, టార్చితోపాటు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ పతాకాన్ని 2018లో జరగనున్న వేదిక జకార్తా (ఇండోనేషియా) ప్రతినిధులకు అందజేశారు.

ఘనంగా ముగిసిన ఆసియా గేమ్స్
11 స్వర్ణాలు, 10 రజతం, 36 కాంస్య పతకాలతో మొత్తం 57 పతకాలను సాధించి భారత్ ఆసియా గేమ్స్ పతకాల పట్టికలో ఎనిమిదో స్దానంలో నిలిచింది.

ఘనంగా ముగిసిన ఆసియా గేమ్స్
మొదటి స్దానంలో చైనా, రెండవ స్దానంలో దక్షిణ కొరియా నిలిచాయి.


Click it and Unblock the Notifications











