Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా అథ్లెటిక్స్: అనర్హతకు గురైన భారత రిలే జట్టు

హైదరాబాద్: భారత పురుషుల 4×100 మీటర్ల రిలే జట్టు అనర్హత వేటుకు గురైంది. పురుషుల 100 మీటర్ల పరుగులో ఫేవరెట్‌ అమియా కుమార్‌ మాలిక్‌ సెమీఫైనల్‌ హీట్‌-3లో రేసును తప్పుగా ఆరంభించడంతో ఇది జరిగింది. శుక్రవారం జరిగిన పరుగు పందెం హీట్స్‌లో అనురూప్‌, దాసన్‌, దేబ్‌నాథ్‌, అమియా కుమార్‌లతో కూడిన జట్టు ఫొటో ఫినిష్‌తో కొరియాను వెనక్కి నెట్టింది.

అయితే ఈ రేసులో చివరి లెగ్‌లో దేబ్‌నాథ్‌ నుంచి బ్యాటన్‌ను అందుకునే ప్రయత్నంలో అమియా కుమార్‌ మాలిక్‌ తన లైన్‌ను దాటి పక్కకు వెళ్లిపోయాడు. దీనిని గుర్తించిన అధికారులు భారత్‌పై అనర్హత వేటు వేసి కొరియా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించినట్లు ప్రకటించారు.

Asian Athletics: Indian men's 4x100m relay team disqualified

ఇదిలా ఉంటే తొలి రోజు పూర్తయిన 400 మీటర్ల సెమీఫైనల్‌ రేసును ఓ అధికారి తప్పిదం కారణంగా శుక్రవారం మళ్లీ నిర్వహించారు. గురువారం ఈ రేసు సందర్భంగా అధికారి అనుకోకుండా తుపాకీ ట్రిగ్గర్‌ నొక్కారు. దాంతో, నిజంగానే రేసు మొదలైందని అథ్లెట్లు పరుగు తీశారు. ఇందులో భారత అథ్లెట్‌ మహమ్మద్‌ అనాస్‌ అగ్రస్థానంలో నిలిచాడు.

అయితే, రేసు పూర్తయ్యాక కొంత మంది అథ్లెట్లు రిఫరీకి ఫిర్యాదు చేయడంతో మళ్లీ శుక్రవారం పరుగు పందెం నిర్వహించారు. భారత్ అథ్లెట్ అనాస్‌ కష్టపడి ఫైనల్‌కు అర్హత సాధించినా ప్రయోజనం లేకపోయింది. తుది రేసులో అతను స్వర్ణం కూడా నెగ్గాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+