ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్ బోణీ.. అన్ను, అవినాష్‌లకు రజతాలు

ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ఆదివారం జరిగిన పోటీలలో భారత్ బోణీ కొట్టింది. మహిళల జావెలిన్ త్రోలో అన్నురాణి రజతం గెలిచింది. జావెలిన్‌ను 60.22 మీటర్ల దూరం విసిరి ద్వితీయ స్థానంలో నిలిచింది. పురుషుల 3 వేల మీటర్ల స్టీఫుల్‌ఛేజ్‌లో అవినాష్ 8:30.19 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి రజతం సాధించాడు.
5000 వేల మీటర్ల మహిళల పరుగులో పరుల్ చౌదరి 15:58.35 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరి కాంస్యాన్ని సాధించింది. మహిళల 400 మీ పరుగులో పూవమ్మ (53.21 సె) కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇక మహిళల 100 మీటర్ల హీట్స్‌లో 11.28 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన ద్యుతి.. తన పేరిటే ఉన్న 11.29 సెకన్ల రికార్డును అధిగమించింది. హీట్స్-4లో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లో ప్రవేశించింది. జిన్సన్ జాన్సన్ (800 మీ), మహ్మద్ అనాస్.. రాజీవ్ అరోకియా (400 మీ)లు కూడా సెమీఫైనల్లోకి వెళ్లారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications