
ఆసియా కప్ షెడ్యూల్ చూసి నేను షాక్ తిన్నా
"షెడ్యూల్ చూసి నేను షాక్ తిన్నా. ఈ రోజుల్లో ఏ టీమ్ వరుసగా రెండు వన్డేలు ఆడుతోంది. ఇంగ్లండ్ పర్యటనలో టీ20ల మధ్యే రెండు రోజుల గ్యాప్ ఉంది. ఎంతో వేడిగా ఉండే దుబాయ్‌లో వరుసగా రెండు రోజులు వన్డేలు షెడ్యూల్ చేశారు. ఇది కచ్చితంగా సరైన షెడ్యూల్ కాదు" అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.

ఆసియా కప్‌లో టీమిండియా ఆడకూడదు
"షెడ్యూల్‌లో ఇలాగే సమస్య ఉంటే ఆసియా కప్‌లో టీమిండియా ఆడకూడదు. వన్డే మ్యాచ్ ఆడిన తర్వాత ఓ ప్లేయర్ దాని నుంచి కోలుకునేందుకు 48 గంటలు అవసరం. మైదానంలో 3.5 గంటలు ఫీల్డింగ్ చేయడంతో పాటు 2 గంటల పాటు బ్యాటింగ్ చేస్తాడు. కాబట్టి 5.5 గంటలు అతడు మైదానంలో గడుపుతాడు" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌ని మూడు రోజులకే
ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీసేన వేడిగాలుల కారణంగా ఎసెక్స్ జట్టుతో జరగాల్సిన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌ని మూడు రోజులకే కుదించుకున్న విషయాన్ని కూడా సెహ్వాగ్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఇలాంటి షెడ్యూల్ వల్ల ఇండియాపై పాకిస్థాన్ పైచేయి సాధించే అవకాశం ఉందని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

ఆ టోర్నీ ఆడకండి
"ఆసియా కప్ కోసం అంత బాధ పడాల్సిన పనిలేదు. ఆ టోర్నీ ఆడకండి. దాని బదులు టీమ్‌ను హోమ్ లేదా విదేశీ సిరీస్‌లకు సిద్ధం చేయండి. వరుసగా రెండు రోజులు ఎవరూ వన్డేలు ఆడరు. ఇలాంటి షెడ్యూల్ వల్ల ఇండియాపై పాకిస్థాన్ పైచేయి సాధించే అవకాశం ఉంది" అని సెహ్వాగ్ తేల్చి చెప్పాడు. ఎందుకంటే సెప్టెంబర్ 16న తొలి మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్‌కు రెండు రోజుల గ్యాప్ తర్వాత ఇండియాతో మ్యాచ్ ఉంది.

ఆసియా కప్ ఫైనల్ సెప్టెంబర్ 28న
ఇప్పటికే ఈ టోర్నీకి ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ అర్హత సాధించాయి. మరో స్థానం కోసం యూఏఈ, సింగపూర్, ఒమన్, నేపాల్, మలేషియా, హాంకాంగ్ తలపడనున్నాయి. గ్రూప్‌లో ఇండియా, పాకిస్థాన్, క్వాలిఫయర్ ఉంటాయి. గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి. రెండు గ్రూపుల నుంచి టాప్-2 టీమ్స్ సూపర్ 4కు క్వాలిఫై అవుతాయి. దుబాయి ఆతిథ్యమిస్తోన్న ఈ ఆసియా కప్ ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది.


Click it and Unblock the Notifications
