Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చిరిగిపోయిన షూ వేలం.. పీఎం-కేర్స్ నిధికి రూ.3.3 లక్షల విరాళం!!

Arjun Bhati sells his torn shoes for Rs 3.3 lakh, donates money for Coronavirus relief works

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్​పై జరుగుతున్న పోరుకు సాయం చేసేందుకు 15 ఏళ్ల భారత గోల్ఫ్​ ప్లేయర్ అర్జున్ భాటి మరోసారి ముందుకొచ్చాడు. 2018 జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో తను ఉపయోగించి చిరిగిపోయిన షూను వేలం వేసి.. తద్వారా వచ్చిన రూ.3.3 లక్షలను గ్రేటర్ నోయిడాకు చెందిన యువ గోల్ఫర్ అర్జున్ భాటి పీఎం-కేర్స్ ఫండ్‌కు మంగళవారం విరాళంగా ఇచ్చాడు.

'2018లో అమెరికా వేదికగా జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్​షిప్​లో విజేతగా నిలిచా. ఆ టోర్నీలో ధరించిన బూట్లను మా అంకుల్​ రూ.3.30 లక్షలకు కొన్నారు. ఆ మొత్తాన్ని పీఎం-కేర్స్ నిధికి విరాళంగా ఇచ్చా. మనం ఉన్నా, లేకున్నా.. మన దేశం పటిష్ఠంగా ఉండాలి. కరోనా నుంచి ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి' అని అర్జున్ భాటి ట్వీట్ చేశాడు. కోవిడ్-19పై కేంద్రం చేస్తున్న పోరుకు మద్దతుగా గతంలో తను గెలుచుకున్న 102 ట్రోఫీలను వేలం వేసి.. రూ.4.3 లక్షలను విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.

15 ఏళ్ల వయసులోనే తన గొప్ప మనసు చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అర్జున్ భాటి. 'వ్యక్తిగతంగా నా వద్ద ఎటువంటి డబ్బు లేదు. అందుకే ట్రోఫీలు విక్రయించాలని నిర్ణయించుకున్నా. దేశానికి సాయం అవసరమైన సమయంలో ఖాళీగా కూర్చోలేను. ట్రోఫీలను భవిష్యత్తులో కూడా సంపాదించుకోవచ్చు. మనం అందరం మహమ్మారిపై విజయం సాధించాలి' అని అర్జున్‌ గతంలో అన్నాడు. ఇక తెలంగాణకు చెందిన 15 ఏళ్ల షూటర్‌ ఇషాసింగ్‌ తాను దాచుకున్న రూ. 30 వేలను ప్రధాన మంత్రి సహాయనిధికి అందజేసిన విషయం తెలిసిందే.

నోయిడా నగరంలోని గ్రేటర్ వ్యాలీ స్కూలులో పదోతరగతి చదువుతున్న అర్జున్ భాటి గోల్ఫ్ క్రీడాకారుడు. కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో తనకు వచ్చిన ట్రోఫీలను తన స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రుల స్నేహితులకు విక్రయించాడు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత వాళ్లకి అందజేస్తానని అర్జున్ పేర్కొన్నాడు. అర్జున్‌ భాటి వినూత్న పద్ధతిలో వితరణ మొత్తాన్ని సేకరించడాన్ని అందరూ అభినందించారు. అంతకుముందు అర్జున్‌ అమ్మమ్మ తన ఏడాది పెన్షన్‌ మొత్తాన్ని (రూ. 2,06,148) పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా ఇవ్వడం విశేషం.

అర్జున్‌ భాటితో పాటు చాలా మంది భారత క్రీడాకారులు ఇప్పటికే పీఎం-కేర్స్ ఫండ్‌కు విరాళాలు ప్రకటించారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, సురేశ్ రైనా, రోహిత్ శర్మ, మేరీ కోమ్, పీవీ సింధు, సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్‌, సానియా మీర్జా, సాయి ప్రణీత్, పఠాన్ బ్రదర్స్, బజరంగ్ పూనియా తదితరులు విరాళంగా ఇచ్చారు.

Story first published: Tuesday, April 21, 2020, 21:08 [IST]
Other articles published on Apr 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+