For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పతకానికి అతి చేరువలో ఆగిన భారత్: ఫైనల్‌-బీలో అయిదో స్థానంలో

Arjun, Arvind finish 5th in Final B of lightweight Mens Double Sculls at Tokyo Olympics 2020

టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ఒలింపిక్స్ 2021లో భారత్ ఏడోరోజు తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. పీవీ సింధు మ్యాచ్, పురుషుల హాకీ, పతకాన్ని ఆశిస్తోన్న మహిళల బాక్సింగ్.. ఇలా కీలక మ్యాచ్‌లల్లో భారత అథ్లెట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌ ఆడుతోన్నారు. డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌ను ఆమె ఢీ కొడుతోన్నారు. 51 కేజీలో మహిళల బాక్సింగ్ విభాగంలో మేరీకోమ్ తన తదుపరి రౌండ్‌ను ఆడనున్నారు. ఈ మ్యాచ్ ఈ మధ్యాహ్నం 3:36 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇవన్నీ సత్ఫలితాలను ఆశించదగ్గవే.

ఈ పరిణామాల మధ్య పురుషుల లైట్ వెయిట్ డబుల్స్ స్కల్ రీపెఛెజ్ విభాగంలో భారత రోయర్లు అంచనాలకు మించి రాణించారు. ఈ కేటగిరీ ఫైనల్-బీలో అయిదో స్థానంలో నిలిచారు. సీ ఫారెస్ట్ వాటర్ వే‌లో నిర్వహించిన ఈ కేటగిరీలో భారత రోయర్ల జోడీ అర్జున్ లాల్ జాట్-అరవింద్ సింగ్ జోడీ తమ రేసును 6:29:66 నిమిషాల్లో ఫినిష్ చేసింది. ఈ కేటగిరీలో స్పెయిన్ మొదటి స్థానంలో నిలిచింది. స్పెయిన్ రోయర్ల జంట టైమింగ్ 6:15:45. 6:16:01 సెకెన్లతో పోలెండ్ రోయర్ల జోడీ రెండో స్థానంలో నిలిచింది. బుధవారం నిర్వహించిన లైట్ వెయిట్ పురుషుల డబుల్స్ స్కల్స్‌లో భారత జోడీ 6:24:41 టైమింగ్‌తో ఫైనల్‌ బీకి చేరుకున్నారు.

ఇందులో సెమీ ఫైనల్‌లో విజయం సాధించితే కాంస్య పతకం ఖాయమౌతుంది. ఫైనల్‌కు చేరగలిగితే రజతం.. అందులో విజయం సాధించగలిగితే గోల్డ్ మెడల్ భారత మెడలో పడినట్టే. తమ ల్యాపింగ్‌ను పోలెండ్ జంట 6:43:44 నిమిషాల్లో పూర్తి చేసి.. టేబుల్ టాప్‌గా నిలిచింది. 6:45:71 నిమిషాల్లో లక్ష్యాన్ని అధిగమించిన స్పెయిన్ రెండో స్థానంలో నిలవగా.. 6:51:36 నిమిషాల్లో ల్యాపింగ్‌ను పూర్తి చేసిన భారత రోయర్లు అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్ జోడీ మూడో స్థానానికి చేరుకుంది. ఆ తరువాతి స్థానంలో ఉజ్బెకిస్తాన్ నిలిచింది. 6:56:22 నిమిషాలకు గమ్యాన్ని చేరిందా దేశ జోడి.

Story first published: Thursday, July 29, 2021, 7:12 [IST]
Other articles published on Jul 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+