యూఎఫ్‌సీ స్టార్ రౌసీతో కలిసి డెన్మార్క్ టెన్నిస్ స్టార్ కరోలినా వోజ్నియా కుర్రాళ్ల మతిపోగొట్టే అవతరామెత్తింది. 'స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్' అనే మ్యాగజైన్ కోసం ఒంటిమీద నూలు పోగు లేకుండా నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చింది. అయితే ఈ ఫోటోలకు ఓ ప్రత్యేకత ఉంది.
ఆ ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా? ఒంటి మీద బట్టలేమీ లేకున్నా, ఆమె నగ్నంగా ఉందన్న విషయం కనిపెట్టడం కాస్తంత కష్టమే. ఎందుకంటే ఆమె ఒంటిపై బికినీ ధరించింది అని అనిపించే విధంగా పెయింటింగ్ వేయించుకుంది.

ఈ నగ్న చిత్రాల్లో సముద్ర తీరంలో వయ్యారంగా నిలబడుతూ ఫొటోలకు పోజులిచ్చింది కరోలినా. ఈ నగ్నం కాని నగ్న చిత్రాలను ఆమె తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. గత ఏళ్లుగా నన్ను ఇంతటి అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన మహిళలకు ధన్వవాదాలంటూ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.