Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దాంపత్య బంధంతో ఒకటవనున్న భారత ఆర్చర్లు

Archers Deepika Kumari, Atanu Das get engaged

న్యూ ఢిల్లీ: భారత టాప్ ఆర్చర్లు అయిన దీపికా కుమారీ.. అటాను దాస్‌లు దాంపత్య బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో ఒకరికొకరు ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం తంతు ముగించారు. వీరి ఇరువురి వివాహం వచ్చే ఏడాది జరగనుంది. క్రీం రంగు లెహంగా-చున్నీ దుస్తుల్లో 24ఏళ్ల దీపికా మెరిసిపోగా 26 ఏళ్ల అటానుదాస్ ఇల్లు ఈ కార్యక్రమానికి వేదికైంది.

ఈ వేడుకకు జార్ఖండ్ మాజీ ముఖ్య మంత్రి అర్జున్ ముండా అతని భార్య మీరా ముండాలు ముఖ్య అతిథులుగా హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆర్చర్లు ఇద్దరూ మాట్లాడుతూ.. 2019 సంవత్సరం అంతా బిజీబిజీగా గడవనుంది. ఒలింపిక్ క్వాలిఫికేషన్స్ నేపథ్యంలో తీరిక లేకుండా గడవనుంది. అందుచేతనే మా వివాహం దాదాపు నవంబరు నెల తర్వాత చేసుకోనున్నామని వెల్లడించారు.

రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారుల్లో వీరిద్దరూ ఉన్నారు. మాజీ ప్రపంచ నంబర్ వన్, కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత అయిన దీపిక ప్రస్తుతం తన ఫామ్‌ను కోల్పోయింది.

దీపిక మూడు కాంస్య పతకాలు, వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఒక రజిత పతకాలని గెలుచుకుంది. కానీ, అదే పంథాను మరోసారి ఒలింపిక్స్‌లో కొనసాగించలేకపోయింది. ప్రపంచ నెం.17గా కొనసాగుతోన్న కోల్‌కతా దాస్.. ఇటీవల పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఇండోనేషియా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లోనూ ఒట్టి చేతుల్తో తిరుగుముఖం పట్టాడు.

Story first published: Tuesday, December 11, 2018, 17:53 [IST]
Other articles published on Dec 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+