ఆర్చరీ ప్రపంచ కప్: దీపికా కుమారికి కాంస్యం

హైదరాబాద్: భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది. టర్కీలోని సంసున్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్స్‌లో దీపిక కుమారి కాంస్యం గెలుచుకుంది. ఆదివారం జర్మనీ ఆర్చర్ లిసా ఉన్రుతో హోరాహోరీగా సాగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో దీపికా కుమారి ఉత్కంఠ విజయం సాధించింది.
ప్రపంచకప్‌లో దీపికకు ఇది ఐదో పతకం కావడం గమనార్హం. ఆరంభం నుంచే ఇద్దరూ హోరాహోరీగా పోరాడడంతో ఐదు సెట్లు ముగిసే సమయానికి 5-5తో స్కోరు సమమైంది. ఆ తర్వాత షూట్ ఆఫ్‌లో కూడా దీపిక, లీసా ఇద్దరూ తొమ్మిదేసి పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచారు.
దీంతో విజేత ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే లక్ష్యానికి మధ్య భాగానికి సమీపంగా ఎక్కువ బాణాలు వేసిన దీపికను విజేతగా నిర్ణయించారు. దీంతో దీపికకు కాంస్యం దక్కింది. ప్రపంచకప్ ఫైనల్స్‌లో పతకం గెలవడం ఆమెకిది ఐదోసారి. అంతకుముందు దీపికా నాలుగు రజత పతకాలు సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications