అప్లై చేసుకోండి: 'మై-ఖేల్ తెలుగు'కు స్పోర్ట్స్ కంటెంట్ రైటర్స్ కావలెను

హైదరాబాద్: స్పోర్ట్స్ కంటెంట్ రైటర్స్‌కు 'మైఖేల్ తెలుగు' సదావకాశం కల్పిస్తోంది. బహుభాషా న్యూస్ పోర్టల్ అయిన వన్‌ఇండియా తన కార్యకలాపాలను మరింతగా విస్తరించే భాగంలో క్రీడావార్తల కోసం 'మైఖేల్ తెలుగు' పోర్టల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ కంటెంట్ రైటర్స్ కోసం 'మైఖేల్ తెలుగు' దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
క్రీడారంగంలో ఎంత అనుభవం అంత మంచిది. పుట్‌బాల్, క్రికెట్, టెన్నిస్ ఇలా మిగతా క్రీడల పట్ల మంచి అవగాహన కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. వార్తలను ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదం చేయగల నైపుణ్యం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత.
ఇంగ్లీషు భాషలో వ్యవహార జ్ఞానం, వర్తమాన క్రీడా వ్యవహారాలపై అవగాహన ఉంటే మరీ మంచిది. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల వయసు మించని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులను ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ చేస్తారు. మీ దరఖాస్తులను ఈ కింది మెయిల్ అడ్రస్‌కు పంపించగలరు. [email protected]
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications