న్యూఢిల్లీ/తిబిలీసీ: మరో భారత అమ్మాయి దేశం గర్వపడేలా చేసింది. ఇటీవల రియో ఒలింపిక్స్ లో రెండు పతకాలను అమ్మాయిలే సాధించగా... మరో భారత క్రీడాకారిణి అద్భుత ప్రదర్శనతో ప్రపంచ వేదికపై సత్తా చాటింది.
మొన్నటి రియో ఒలింపిక్స్‌లో పతక నిరీక్షణకు తెరదించుతూ సాక్షి మాలిక్, పీవీ సింధు యావత్ భారతాన్ని సంతోషంలో ముంచెత్తగా.. తాజాగా హర్యానా రెజ్లర్ మనీషా అదరగొట్టింది.

జార్జియాలోని తిబిలిసిలో జరుగుతున్న ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో హర్యానా అమ్మాయి మనీషా అద్భుత ప్రదర్శన చేసింది. 38 కిలోల విభాగంలో ఫైనల్లో గెలిచి స్వర్ణం చేజిక్కించుకుంది. ఫైనల్లో ఆమె 2-1తో బల్గేరియా క్రీడాకారిణి జార్కోవా దెల్చేవాను ఓడించింది.