Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రత్యర్థులకు సింహస్వప్నం టాటూ

పుణె: ఇండియన్‌ సూపర్‌లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) మూడో సీజన్‌ టోర్నీలో పుణె సిటీ ఎఫ్‌సి జట్టు మరింత బలోపేతం కానున్నది. ఫుట్‌బాల్‌ ఆట కెరీర్‌ అంతా సొంత దేశానికే ప్రాతినిధ్యం వహించిన స్పెయిన్‌ ఫార్వర్డ్‌ ప్లేయర్‌ జీసస్‌ టాటూ.. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐఎస్‌ఎల్‌ టోర్నీలో పుణె సిటీ ఎఫ్‌సి జట్టుతో ఆడేందుకు అంగీకరించాడు.

ఈ మేరకు జట్టు ఫ్రాంచైసీ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సందర్భంగా జీసస్‌ టాటూ మాట్లాడుతూ ఇప్పటి వరకు సౌకర్యవంతమైన జోన్‌లో ఫుట్‌బాల్‌ ఆడిన తాను ఇతర ప్రాంతాల్లో ఆడాలని ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 'నా కెరీర్‌లో కొత్త పేజీ ప్రారంభమైంది. నూతన సంస్కృతి, నూతన స్టయిల్‌తోపాటు విభిన్న ఆటగాళ్లతో కలిసి ఆడటం ఒక సవాల్‌ అని, దీనివల్ల నన్ను మంచి ఆటగాడిగా నిలుపుతుందని ఆశతో ఉన్నా' అని అన్నాడు.

Another big name as Pune City sign Spanish forward Jesus Tato

బార్సిలోనాతో కెరీర్‌ ప్రారంభం

బార్సిలోనా యూత్‌ టీం తరుపున తొలుత కెరీర్‌ ప్రారంభించిన టాటూ కాటలాన్‌ జెయింట్స్‌ కోసం మూడేళ్ల గడువులోపే 11 గోల్స్‌ సాధించడం విశేషం. మునికా, అల్బాసెటె, జెరెజ్‌, లాస్‌పల్మాస్‌, గిరోనా, జారాగోజా జట్లలో సీనియర్‌ ఆటగాడిగా ఆడిన టాటూను జట్టులోకి తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయని పుణె సిటీ ఎఫ్‌సి ఫ్రాంచైసీ యాజమాన్యానికి జట్టు చీఫ్‌ కోచ్‌ అంటోనియో హబాస్‌ సూచించారు. దీంతో హబాస్‌ సొంత దేశం నుంచి ఫుణె సిటీలో మరో క్రీడాకారుడు చేరినట్లయింది.

ప్రత్యర్థులకు సింహస్వప్నం టాటూ

టాటూ ఆటకే పరిమితం అయి ఉంటాడని, కనీసం క్రీడాకారుడిగా తీసుకోవాలని హబాస్‌ అన్నాడు. అటాకింగ్‌ చేయాలన్న అతడి మైండ్‌ సెట్‌ ఆయన తన ప్రత్యర్థి జట్టుకు ప్రమాదకరంగా కనిపించేలా చేస్తుందని, కొత్త జట్టులోకి ఆతడికి స్వాగతం పలుకుతున్నానని, టాటూ రాకతో పుణె సిటీ విజయావకాశాల్లో స్పష్టమైన తేడా ఉండవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశాడు హబాస్‌.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+