బీజింగ్: మహిళా లాంగ్ జంప్ లో అంజూ బాబీ జార్జ్ పైనల్స్ కు అర్హత సాధించలేకపోయారు. మంగళవారం జరిగిన పోటీలో ఆమె వెనకంజ వేసారు. ఇది భారత అభిమానులనే కాకుండా అంజూను కూడా అసంతృప్తికి గురి చేసింది. అంజూ బీజింగ్ ఒలింపిక్స్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆమె అత్యుత్తమ దూరం 6.83 మీటర్లు జంప్ చేయలేకపోయింది. మూడు ప్రయత్నాల్లోనూ ఆమె విఫలమైంది.