న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వయాగ్రా మాత్రలే ముంచాయి: ఆండ్రూ ఫ్లింటాఫ్

లండన్‌: ఇంగ్లాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ ఫ్లింటాఫ్‌ తనకు ఎదురైన ఓ విచిత్రమైన పరిస్థితిని వెల్లడించాడు. కండరాలు పట్టేయడంతోనో.. ఇంకేదైనా గాయంతోనో.. వికెట్ల మధ్య సరిగా పరుగెత్తలేక రనౌటైన క్రికెటర్లను చూసి ఉంటాం. కానీ, ఫ్లింటాఫ్ ఓ అసాధారణ కారణంతో రనౌటయ్యాడట.

ఏ మ్యాచులో ఇలా జరిగిందో వివరించలేదు కానీ, అందుకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించాడు. తాను ఓసారి 'వయాగ్రా' మాత్రల ప్రభావం వల్ల వికెట్ల మధ్య పరుగు తీయలేక రనౌటైపోయానని ఫ్లింటాఫ్ పేర్కొన్నాడు.

మ్యాచుకు ముందు రోజు రాత్రి వేసుకున్న వయాగ్రా మాత్రల ప్రభావం ఉదయం మ్యాచ్‌ ఆడుతున్నపుడూ ఉండటంతో తాను తీవ్రంగా ఇబ్బంది పడినట్లు ఫ్లింటాఫ్ వివరించాడు.

Andrew Flintoff Reveals How Viagra Ran Him Out During a Test Match

'ముందు రోజు రాత్రి మూడు వయాగ్రా మాత్రలు వేసుకున్నా. వాటి ప్రభావం ఎంతసేపు ఉంటుందన్నది తెలియదు. మరుసటి రోజు బ్యాటింగ్‌కు వెళ్తే చాలా కష్టమైంది. వేగంగా ముందుకు కదల్లేని పరిస్థితిలో రనౌటైపోయా. అప్పుడు నేను గెంతడం తప్ప ఇంకేం చేయలేకపోయా' అని ఫ్లింటాఫ్‌ తనకెదురైన పరిస్థితి వివరించాడు.

అయితే ఏకంగా మూడు వయాగ్రా మాత్రలు వేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందన్నది మాత్రం ఫ్లింటాఫ్‌ వెల్లడించలేదు. మద్యానికి బానిసైన ఫ్లింటాఫ్ తీవ్ర నిస్పృహకు లోనై ఇంగ్లాండ్ జట్టుకు 37ఏళ్ల వయస్సులోనే దూరమయ్యాడు. ప్రస్తుతం టీవీ రియాల్టీ షోస్, సెలబ్రిటీ టాక్ షోలతో వార్తల్లో ఉంటున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X