రెచ్చిపోయిన రస్సెల్: పంజాబ్ ఆశలపై కోల్‌కతా నీళ్లు
పుణే: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‍లో కోల్‌కతా గెలుపొందింది. రస్సెల్ 36 బంతుల్లో 66 పరుగులు మెరవడంతో కోల్‌కతా అనూహ్యంగా గెలిచింది. పంజాబ్ యువ పేసర్ సందీప్ శర్మ 25 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇతని దూకుడుకు కోల్‌కతా కేవలం 8 ఓవర్లకే అయిదు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో యూసుఫ్ పఠాన్ (24 బంతుల్లో 28 పరుగుల), రసెల్‌లు ధాటిగా ఆడి కోల్‌కతా కు విజయాన్ని అందించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ ఆద్యంతం తడబడింది. బెయిలీ (45 బంతుల్లో 60 పరుగులు) కారణంగా పంజాబ్ 155 పరుగులు చేసింది.

అనంతరం ఆండ్రె రసెల్ సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్‌పై కోల్‌కతాకు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని నైట్ రైడర్స్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications