For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కామన్ వెల్త్ లో మెరిసిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు

By Pratap
Andhrapradesh
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి కామన్ వెల్త్ క్రీడలకు ప్రాతినిధ్యం వహించిన ప్రతి క్రీడాకారుడు, క్రీడాకారిణి భారత్ కు పతకాలు అందించారు. రాష్ట్రం నుంచి 15 మంది కామన్ వెల్త్ క్రీడల్లో పాల్గొంటే 15 మంది పతకాలు సాధించారు. భారత్ కు తొలి స్వర్ణపతకాన్ని అందించింది రాష్టానికి చెందిన గగన్ నారంగ్ కాగా, చివరి స్వర్ణ పతకం అందించింది కూడా రాష్ట్రానికి చెందిన సైనా నెహ్వాల్ కావడం విశేషం. అభినవ్ బింద్రాతో కలిసి గగన్ నారంగ్ కామన్ వెల్త్ లో భారత్ కు తొలి స్వర్ణపతకాన్ని అందించాడు. చివర బ్యాడ్మింటన్ మహిళా సింగిల్స్ లో విజయం సాధించి సైనా నెహ్వాల్ స్వర్ణపతకాన్ని అందించింది. దాంతో భారత్ కామన్ వెల్త్ క్రీడల్లో 38 స్వర్ణపతకాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది.

హైదరాబాద్ కు చెందిన గగన్ నారంగ్ కామన్ వెల్త్ క్రీడల్లో నాలుగు స్వర్ణపతకాలు సాధించి మెల్ బోర్న్ రికార్డును సమం చేశాడు. భారత్ తరఫున నాలుగు స్వర్ణాలు సాధించిన ఏకైక క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు కూడా. షూటింగ్ లో నారంగ్, అషెన్ నోరీయా తమ ప్రతిభను చాటారు. బ్యాడ్మింటన్ లో సైనా, జ్వాలా గుత్తా, అశ్విని, కశ్యప్, చేతన్ తమ ప్రతిభను చాటారు. బాడ్యింటన్ లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందంటే అది ఆంధ్రప్రదేశ్ సత్తానే. అథ్లెటిక్స్ లో గీత, నజీబ్ తమ సత్తా చాటారు. అర్చరీలో జిజ్ఞాస్, రితుల్ ఛటర్జీ, వెయిట్ లిఫ్టింగ్ లో వల్లూరి శ్రీనివాస రావు తమ ప్రతిభను కనబరిచి పతకాలు సాధించారు. టెన్నిస్ లో సానియా మీర్జా పతకాలు సాధించి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన రజని హాకీ మహిళా జట్టుకు రెండో గోల్ కీపర్ గా వ్యవహరించింది. సానియా మీర్జా మహిళా టెన్నిస్ లో అంచనాలను అందుకోలేకపోయినా సింగిల్స్ లో రజతం, డబుల్స్ లో కాంస్యం సాధించింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+