ప్రామిస్ నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా: కిదాంబికి కారు బహుమానం
హైదరాబాద్: తాను ఇచ్చిన మాటను ఆనంద్ మహీంద్రా నిలబెట్టుకున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరిస్ విజేతగా నిలిచిన స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు మహీంద్రా సంస్ధ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా టీయూవీ 300 కారుని బహుమానంగా ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
శుక్రవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో వరుసగా ఇండోనేషియా ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్‌కు కారుని బహుమానం ఇచ్చి ఆయన చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... జూన్ 25న జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 22-20, 21-16తో వరుస గేముల్లో ఒలింపిక్ చాంపియన్ చెన్‌లాంగ్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్‌తో సగటు భారతీయుడు గర్వపడేలా చేసిన శ్రీకాంత్‌కు ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర తమ కంపెనీకి చెందిన టీయూవీ 300 కారును బహుమతిగా ఇస్తామని తెలిపారు. అంతేకాదు ఆ కారుని తానే స్వయంగా అతనికి అందజేస్తానని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
క్రికెటర్లు అందుకునే మొత్తంతో పోల్చితే చాలా తక్కువని, టాప్ షట్లర్‌కు ఏదైనా ఇవ్వాలని ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు ఆనంద్ స్పందించారు. 'ఓకే.. శ్రీకాంత్ పోరాటస్ఫూర్తి మనల్ని గర్వపడేలా చేసింది. స్టీమ్‌రోలర్‌కు ఒక యుద్ధ ట్యాంకర్ అవసరం. శ్రీకాంత్‌కు నా చేతుల మీదుగా టీయూవీ300ను అందిస్తాను' అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications