Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చెస్ విశ్వవిజేత ఆనంద్ కు అవమానం


Viswanathan Anand న్యూఢిల్లీ: చెస్ విశ్వ విజేత విశ్వనాధన్ అనంద్ కు ఢిల్లీ విమానాశ్రయంలో అవమానం జరిగింది. ఆనంద్ కు స్వాగతం పలికేందుకు అధికారులు సరిగా ఏర్పాట్లు చేయలేదు. దీంతో విమానాశ్రయంలో తొక్కిసలాట వాతావరణం ఏర్పడింది. అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ వారిని నియంత్రించే ఏర్పాట్లేవీ జరగలేదు.

ఆనంద్ తో ఫొటోలు తీయించుకోవడానికి అధికారులు పోటీలు పడ్డారు. ఈ స్థితిలో ఆయనకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. మీడియాతో మాట్లాడేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. ఆయన అసహనానికి గురయ్యారు. ఏదో విధంగా దారి చేసుకుని ఆయన అక్కడి నుంచి బయటపడ్డారు. క్రికెటర్లకు ఇతోధిక ప్రాధాన్యం ఇస్తూ ఇతర ఆటల విజేతలను పట్టించుకోకపోవడంపై ఇప్పటికే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ స్థితిలో ఆనంద్ కు ఇలా జరగడం తీవ్ర పరిణామాలకే దారి తీయవచ్చు.
Story first published: Monday, October 15, 2007, 23:53 [IST]
Other articles published on Oct 15, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+