Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచ పారా అథ్లెటిక్స్‌: అమిత్‌ కుమార్‌కు రజతం

హైదరాబాద్: ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన పారా అథ్లెట్ అమిత్‌కుమార్ సరోహా మరోసారి సత్తాచాటాడు. హర్యానాకు చెందిన అమిత్ వరుసగా రెండోసారి ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకం అందించాడు. అతను క్లబ్‌ త్రోలో రజతం పతకం సాధించాడు.

సోమవారం జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో 32 ఏళ్ల అమిత్‌కుమార్ క్లబ్ త్రో (ఎఫ్51) పోటీల్లో రెండోస్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. ఫైనల్లో అమిత్‌ మూడో ప్రయత్నంలో 30.25 మీటర్లు త్రోచేసి రెండోస్థానంలో నిలిచాడు. తద్వారా తన పేరిట సరికొత్త ఆసియా రికార్డు నెలకొల్పాడు.

Amit Kumar wins silver in World Para Athletics Championships

సెర్బియాకు చెందిన జెజ్‌కో దిమిత్రిజెవిచ్ 31.99 మీటర్లు త్రో చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకం సాధించాడు. మరో భారత అథ్లెట్‌ ధర్మబీర్‌ (22.34 మీ) పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే జావెలిన్‌ త్రోలో సుందర్‌సింగ్‌ గుర్జర్‌ స్వర్ణ పతకం గెలిచిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+