Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంబానీ-మర్చంట్‌ల పెళ్లి: ప్రపంచమే మన వైపు చూసింది..ఎందుకో తెలుసా..?

ముంబై: 2024 జూలైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఓ సెలబ్రిటీ పెళ్లి కాదు, భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పిన ఓ సాంస్కృతిక ఘట్టం. ఈ వేడుకకు హాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, టెక్ దిగ్గజాలు, క్రీడా ప్రముఖులు హాజరై, భారతీయ ఆచారాలు, దుస్తులను ఎంతో గౌరవంగా స్వీకరించారు. బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్, జాన్ సెనా, కిమ్ కార్దాషియన్ వంటి ప్రముఖులు భారతీయ వస్త్రధారణలో, మన సంప్రదాయాలకు తగ్గట్టుగా వేడుకల్లో పాలుపంచుకోవడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

వారి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు, హిందీ క్యాప్షన్లు, భారతీయ సంప్రదాయాల ప్రస్తావనలతో వైరల్ అయ్యాయి. ఇది భారతదేశ గొప్ప వారసత్వానికి ప్రపంచవ్యాప్త గుర్తింపునిచ్చింది. వోగ్, న్యూయార్క్ టైమ్స్, CNN, BBC వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు పెళ్లి ఆడంబరం కోసం కాకుండా, వేడుకలో ఇమిడిఉన్న సంస్కృతిని భారతీయ సంప్రదాయాలను లోతుగా కవర్ చేశాయి.

ambani-merchant-wedding-global-elite-celebrate-indias-rich-traditions

అనంత్ రాధికా మర్చంట్‌ల వివాహం కోసం ప్రపంచం భారత్‌కు తరలివచ్చింది.మన సంప్రదాయాలు, సంస్కృతి కేవలం భారత్‌కే పరిమితం కాకుండా ప్రపంచ వేదికలపై కూడా ఉండాలన్న లక్ష్యాన్ని ఈ వివాహం చాటింది. వివిధ సంస్కృతులకు చెందిన ప్రముఖులు భారతీయ సంప్రదాయాలైన హల్దీ, సంగీత్,ఇతర వివాహ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని సంబరపడ్డారు. అంబానీ కుటుంబం ఈ సందర్భంగా భారత సంస్కృతిని, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే రాయబారులు పాత్రను పోషించింది.

అనంత్-రాధికల వివాహం ప్రపంచాన్ని ఏకం చేసిన ఓ సాంస్కృతిక మైలురాయి. ఇది మన మూలాలకు కట్టుబడి ఉండటంలోనే అసలైన ఫ్యాషన్, అందం, అర్థం ఉన్నాయని ప్రపంచానికి గుర్తు చేసింది. ఈ పెళ్లి జరిగి ఏడాది అవుతున్నా, ప్రజలు గుర్తుంచుకుంది కేవలం దాని గొప్పతనాన్ని కాదు, అందులోని ఆత్మీయతను, పవిత్రతను, ప్రపంచం మన భారతీయ లయకు అనుగుణంగా ఎలా నృత్యం చేసిందో అనే విషయాన్ని కూడా. సాంప్రదాయ దుస్తుల్లో అంతర్జాతీయ సెలబ్రిటీలు, దేవతల ముందు తలవంచి, నవ దంపతులను ఆశీర్వదించిన దృశ్యాలు ఈ పెళ్లి కేవలం వ్యక్తిగతం కాదని, అది ప్రపంచం మరిచిపోలేని ఓ సాంస్కృతిక ఘట్టమని చాటాయి.

Story first published: Sunday, July 13, 2025, 8:30 [IST]
Other articles published on Jul 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+