For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాజ్యసభ ట్రాక్‌లోకి గోల్డెన్ గర్ల్ పీటీ ఉషా.. చరిత్ర మరవని ఆమె రికార్డులు, ఘనతలు ఇవే..!

All You Need to know About Pt Usha Before We going to know She is Nominated to Rajyasabha

లెజెండరీ అథ్లెట్‌ పీటీ ఉష, మ్యూజిక్‌ మాస్ట్రో ఇళయరాజా, సినీ నిర్మాత, స్క్రిప్ట్ రచయిత వి.విజయేంద్ర ప్రసాద్‌లు బుధవారం రాజ్యసభకు నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. వీరందరికీ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఇక భారత గోల్డెన్ గర్ల్ ఉషాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆమెతో కలిసి దిగిన ఫోటోను నరేంద్ర మోదీ షేర్ చేశారు. 'పీటీ ఉషా జీ భారతీయులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. క్రీడలలో ఆమె సాధించిన విజయాలు మనందరికీ తెలిసినప్పటికీ.. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె ఎంతో మంది అథ్లెట్లను తయారుచేయడానికి మార్గదర్శకత్వం వహిస్తూ.. భావి భారత అథ్లెట్లను తయారు చేయడంలోనూ నిరంతం కృషి చేస్తుంది. ఆ కృషి మెచ్చుకోదగినది. రాజ్యసభకు నామినేట్ అయినందుకు ఆమెకు అభినందనలు.' అంటూ మోదీ ప్రస్తావించారు.

పీటీ ఉషా పూర్తి పేరు పిలవుల్లకండి తెక్కెరపరంబిల్ ఉషా. ఆమె 1964 జూన్ 27న కేరళలోని పయ్యోలి గ్రామంలో పేద కుటుంబంలో జన్మించింది. కానీ ఆమె పేదరికాన్ని ఎదిరించి.. క్రీడలపై అత్యంత మక్కువ కనబర్చింది. కన్ననూర్ (కన్నూరు)లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో ఆమె తనను తాను పరుగులో సానబెట్టుకుంది. 1979లో ఆమె అథ్లెటిక్ (రన్నింగ్‌) ప్రారంభమైన ప్రయాణం ఇండియాస్ క్వీన్ ఆఫ్ ట్రాక్‌గా నిలిచేదాకా సాగింది.

1980లో మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొన్న మొదటి భారతీయ మహిళగా పీటీ ఉషా ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత 1982లో న్యూ ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో ఆమె రజత పతకాన్ని కైవసం చేసుకున్నాక.. ఇక అప్పటి నుంచి ఆమె రికార్డుల పరంపరకు తిరుగులేకుండాపోయింది. ఆసియా క్రీడలు మరియు ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో మొత్తం 30అంతర్జాతీయ అవార్డులు, 13బంగారు పతకాలను ఆమె గెలుచుకుంది. 1984లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఆమె త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. ఇక ఆమె సాధించిన రికార్డులు, ఘనతలను ఓసారి పరిశీలిస్తే..

1980లో మాస్కో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి భారతీయ మహిళగా రికార్డు.
1982లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో 100మీ, 200మీ పరుగుపందెంలో రజత పతకాలు కైవసం
1983లో ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్‌షిప్ (ATF)లో గోల్డ్ మెడల్ కైవసం
1983-89 మధ్య జరిగిన ATF మీట్స్‌లో 13గోల్డ్ మెడల్స్ సొంతం
1985 ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 5 బంగారు పతకాలు
1985లో జరిగిన జకార్తా ఆసియా అథ్లెట్ మీట్‌లో "గ్రేటెస్ట్ ఉమెన్ అథ్లెట్"గా బిరుదు.
1984లో భారత ప్రభుత్వంచే భారతీయ క్రీడా గౌరవం అయిన "అర్జున అవార్డు"ను, అలాగే "పద్మశ్రీ" పురస్కారాన్ని అందుకున్నారు.
1986 సియోల్ ఏషియన్ గేమ్స్‌లో "అడిడాస్ గోల్డెన్ షూ అవార్డ్" పొందారు.
1985 మరియు 1986లో ఉత్తమ అథ్లెట్‌గా ప్రపంచ ట్రోఫీని రెండుసార్లు గెలుచుకున్నారు
1986లో జరిగిన 10వ ఆసియా క్రీడల్లో ఒక రజత పతకం, నాలుగు బంగారు పతకాలు సాధించారు.
1990 ఆసియా క్రీడల్లో 400మీ మరియు 4x100మీ రిలేలో రజత పతకాలు
1994 ఆసియా క్రీడల్లో 4x400 మీటర్ల రిలేలో రజత పతకం
1998లో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 4x100 మీటర్ల రిలేలో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.
1984, 1985, 1986, 1987 మరియు 1989లో ఐదుసార్లు "ఆసియాలో ఉత్తమ అథ్లెట్" అవార్డును అందుకున్నారు.

Story first published: Wednesday, July 6, 2022, 21:43 [IST]
Other articles published on Jul 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+