అర్థరాత్రి చక్కర్లు కొడుతున్న క్రికెటర్: ఇంటికి పంపాలని బిసిబి నిర్ణయం
సిడ్నీ: నిబంధనలు ఉల్లంఘించి రాత్రి 10 తర్వాత సిడ్నీలో చక్కర్లు కొడుతున్న తమ జట్టు క్రికెటర్‌ను ఇంటికి పంపాలని నిర్ణయించింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. రాత్రి 10 గంటలలోపు జట్టు ఆటగాళ్లు తమ హోటల్‌కి రావాలనే నియమాన్ని ఫిబ్రవరి 19న పేసర్ అల్ అమీన్ ఉల్లంఘించాడని టీమ్ మేనేజర్ ఖలీద్ మహ్ముద్ తెలిపారు.
ఒకవేళ రాత్రి 10 తర్వాత బయటకు వెళ్లాల్సి వస్తే టీమ్ మేనేజ్‌మెంట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అల్ అమీన్ రాత్రి పూట తిరుగుతున్నాడని తమకు మొదట తెలియదని, యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ నిట్(ఏసిఎస్‌యు) ఇచ్చిన సమాచారంతో ఈ విషయం తెలిసిందని టీమ్ మేనేజర్ చెప్పారు.

వీలైనంత త్వరగా అతడ్ని బంగ్లాదేశ్‌కు పంపిస్తామని ఆయన తెలిపారు. కాగా, 25ఏళ్ల అమీన్ ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైనప్పటికీ ఒక్క మ్యాచులో కూడా ఆడలేదు. ప్రపంచ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ ఒక గెలుపును నమోదు చేసింది.
ఆఫ్ఘనిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్ గెలుపొందింది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఘోర ఓటమిని చవిచూసింది. ఫిబ్రవరి 26న శ్రీలంకతో బంగ్లాదేశ్ జట్టు తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications