Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సానియాను పిలిచా, కానీ రాలేదు: అక్తర్


Shoaib Aktarలక్నో: చండీఘడ్ లోని ఆనాథాశ్రమానికి హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జాను కూడా ఆహ్వానించానని, అయితే బిజీ షెడ్యూల్ వల్ల సానియా రాలేకపోయారని పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పారు. క్రికెటర్లలో షోయబ్ అక్తర్ ను తాను అభిమానిస్తానని సానియా మీర్జా గతంలో ఒకసారి చెప్పారు.

మొహాలి వన్డే మ్యాచును సానియా చాలా సేపు వీక్షించిన విషయం తెలిసిందే. శనివారంనాడు చండీఘడ్ లోని అనాధాశ్రమాన్ని సందర్శించిన అక్తర్ సోమవారంనాడు లక్నోలోని ఒక మానసిక వికలాంగుల బాలుర పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తాను పాకిస్తానులో కూడా క్యాన్సర్ అస్పత్రికి వెళ్తుంటానని, ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుంటానని, అయితే భారత్ లో మాదిరిగా మీడియా ప్రచారం ఉండదని, అక్కడ మీడియా తక్కువ కాబట్టి ఆ ప్రచారం ఉండదని ఆయన అన్నారు. సామాజిక సేవను తాను బాధ్యతగా భావిస్తానని, సేవాకార్యక్రమాలు తనకు ఎంతో ఆనందాన్నిస్తాయని ఆయన అన్నారు. లక్నోలోని పాఠశాలలో ఆయన పిల్లలతో చాలాసేపు గడిపారు. పిల్లలకు ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు. వారిని ఎత్తుకున్నారు.
Story first published: Monday, November 12, 2007, 23:53 [IST]
Other articles published on Nov 12, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+