Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అత్యల్ప ధర పలికిన కమ్రాన్ అక్మల్

Kamran Akmal
ముంబయి: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వేలం పాటల్లో పాకిస్తాన్ క్రీడాకారుడు కమ్రాన్ అక్మల్ కు అత్యల్ప ధర పలికింది. అక్మల్ ను కేవలం 60 లక్షల రూపాయలకే జైపూర్ టీం పాడుకుంది. మరో పాకిస్తాన్ ఆటగాడు యూనిస్ ఖాన్ ను కేవలం 96 లక్షల రూపాయలకే జైపూర్ టీం దక్కించుకుంది. భారత బౌలర్ శ్రీశాంత్ ను 2.5 కోట్ల రూపాయలకు మొహాలి టీం పాడుకుంది. ఆసిఫ్ ను ఢిల్లీ టీం 2.6 కోట్ల రూపాయలకు కొనుక్కుంది. గిబ్స్ ను 2.3 కోట్ల రూపాయలకు హైదరాబాద్ టీం పాడుకుంది. స్మిత్ ను 1.9 కోట్ల రూపాయలకు జైపూర్ టీం కొనుక్కుంది.

పాకిస్తాన్ దూకుడు ఆటగాడు ఆఫ్రిదీని హైదరాబాదు టీం 2.7 కోట్ల రూపాయలకు పాడుకుంది. మార్క్ బౌచర్ 1.8 కోట్ల రూపాయలకు బెంగుళూర్ టీం, అదే రేటుకు డీవిలియర్స్ ను ఢిల్లీ టీం కొనుక్కున్నాయి. పార్ధివ్ పటేల్ ను 1.3 కోట్లకు చెన్నై టీం పాడుకుంది. దినేష్ కార్తిక్ ను 2.1 కోట్ల రూపాయలకు ఢిల్లీ టీం కొనుగోలు చేసింది. జహీర్ ఖాన్ ను 1.8 కోట్లకు బెంగుళూర్ టీం, ఫ్లెమింగ్ ను 1.4 కోట్ల రూపాయలకు చెన్నై టీం, కలిస్ ను 3.6 కోట్ల రూపాయలకు బెంగుళూర్ టీం, గేల్ ను 3.2 కోట్ల రూపాయలకు కోల్ కత్తా టీం, మాలీక్ ను 2 కోట్ల రూపాయలకు ఢిల్లీ టీం దక్కించుకున్నాయి.
Story first published: Wednesday, February 20, 2008, 15:58 [IST]
Other articles published on Feb 20, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+