Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సార్, చికిత్స చేయించుకోవడానికి డబ్బుల్లేవ్. కాపాడండి

Ailing archer Gohela Boro awaits help from sports ministry

హైదరాబాద్: సార్, నాకు వెంటనే సాయం అందించండి. లేకపోతే నా ఆర్చరీ కలలన్నీ ముక్కలైపోతాయి. అస్సాం రాష్ట్రంలోని కొక్‌రాఝర్ జిల్లావాసి అయిన 21 ఏళ్ల గొహెలా బొరొ తన ఆక్రందనను వినమంటుంది. జాతీయ స్థాయి క్రీడాకారిణి అయిన గొహెలా ఇప్పటి వరకు 77 పతాకాలను గెలుచుకుంది. ప్రస్తుతం తనకు ఓ అరుదైన వ్యాధి సోకడంతో చికిత్స కోసం డబ్బులు లేవని వాపోతుంది. క్రీడా మంత్రిత్వ శాఖకు విన్నవించుకున్నా ప్రయోజనం లేదంటూ రోధిస్తుంది.

2015 కేరళ నేషనల్స్ గేమ్స్‌లో స్వర్ణాన్ని గెలుచుకున్న ఈ విలుకారిణి(ఆర్చర్). పన్నెండేళ్ల వయస్సు నుంచే తన ఈ రంగంలో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 77పతకాలను గెలుచుకున్న ఆమెకు ఇప్పుడొక అంతు చిక్కని వ్యాధి సోకడంతో చికిత్స చేయించుకోవడం కోసం నానా ఇబ్బందులు పడుతుంది. సిస్టమిక్ ల్యూపస్ ఎరిథోమాటొసస్, యాంటి న్యూట్రోఫిల్ సైటోఫ్లాస్మిక్ యాంటీబాడీస్ వ్యాధులు ఆమె శరీరాన్ని కుంగదీస్తున్నాయి. ఈ వ్యాధితో ఆవిడ చేతి వేళ్లు పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంది. ఈమె తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుని పొట్టనింపుకునే వారు.

ఈమె నవంబరు 2016లో గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో రెండు నెలల పాటు చికిత్స చేయించుకున్నారు. ఇంకా చికిత్స మిగిలి ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వైద్యులు సూచించారు. ఇప్పటి వరకు అస్సాంలోని రెండు ఎన్‌జీఓలు ఆర్థికంగా సర్థడంతో ఇక్కడ వరకు తీసుకురాగలిగారు. క్రీడా మంత్రిత్వశాఖను ఆదుకోవాలంటూ ఆమె మంత్రి రాజ్యవర్ధన్ సింగ్‌ను అర్ధిస్తుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 29, 2017, 11:09 [IST]
Other articles published on Dec 29, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+