నువ్వెందుకు ఏడ్చావు?: వైరల్ వీడియోపై తల్లిని ప్రశ్నించిన స్వప్న బర్మన్

హైదరాబాద్: ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా ఇటీవల ముగిసిన ఆసియా గేమ్స్ హెప్టాథ్లాన్ విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన భారత తొలి క్రీడాకారిణిగా స్వప్న బర్మన్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆసియా గేమ్స్‌లో స్వప్న బర్మన్ గెలవగానే ఆమె తల్లి ఆనందంలో ఎగిరి గంతేసింది.
కన్నీరు పెట్టుకుంది. ఆ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం తన "మన్‌కీ బాత్"లో ప్రస్తావించారు. ఈ వీడియో గురించి చరిత్ర సృష్టించిన స్వప్న ఏమందంటే ఇండియా టుడే ఈస్ట్ కాంక్లేవ్‌లో స్పందించింది.
"నువ్వెందుకు ఏడ్చావు? నవ్వాలి కదా! ఆ వీడియో ఎవరు తీశారు? నేను మొదటి స్థానంలో నిలిచాను. నువ్వు నవ్వాలి కదా అని అడిగాను. నేనిప్పటికీ ఆ వీడియో పూర్తిగా చూడలేదు. అది వైరల్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ సైతం దాని గురించి ప్రస్తావించారు" అని స్వప్న బర్మన్ చెప్పింది.

ఎంతోమంది స్వాగతం పలికారు
ఆసియా కప్ ముగించుకుని తన స్వగ్రామానికి తిరిగొచ్చాక తనకు ఎంతోమంది స్వాగతం పలికారని స్వప్న పేర్కొంది. "‘నాకోసం ఏడుస్తారన్న కనీస ఆలోచన నాకు లేదు. కానీ మా అమ్మ ఏంతగానో ఏడ్చింది. ఓ ఏడాది వరకు నేను ఇంటి ముఖం చూడలేదు. ప్రస్తుతం నా జీవితం మారిపోయింది. నేను మారలేదు" అని తెలిపింది.

అంతా కలగా అనిపిస్తోంది
"ప్రజలు నన్ను చూసే తీరు పూర్తిగా మారిపోయింది. దీని గురించెప్పుడూ ఆలోచించలేదు. అంతా కలగా అనిపిస్తోంది. నేను నిద్రపోతున్నానా?" అని స్వప్న బర్మన్ వెల్లడించింది. ప్రస్తుతం తన ముందున్న ఏకైక లక్ష్యం టోక్యో వేదికగా 2020లో జరిగే ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన చేయడమే అని చెప్పుకొచ్చింది.

నిరుపేద కుటుంబంలో జన్మించిన స్వప్న బర్మన్
స్వప్న బర్మన్ నేపథ్యంలోకి వెళ్తే... పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్ గురి ప్రాంతంలో 1996, అక్టోబర్ 29న ఒక గిరిజన తెగకు చెందిన పంచానన్ బర్మన్, బసాన దంపతులకు జన్మించింది. స్వప్నది నిరుపేద కుటుంబం. తండ్రి రిక్షా కార్మికుడు, తల్లి తేయాకు తోటలో పనిచేసే దినసరి కూలీ. ఆమె పాదాలకు ఆరు చొప్పున 12 వేళ్లు ఉంటాయి.

ప్రత్యేక బూట్లను అందుకోనున్న స్వప్న బర్మన్
అందుకు అనువైన షూ సైతం దొరకదు. అయితే, ఆసియా గేమ్స్‌లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన స్వప్న బర్మన్ త్వరలో ప్రత్యేక బూట్లను అందుకోనుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) ఆమె కోసం ప్రత్యేకమైన బూట్లు తయారు చేయించి ఇచ్చేందుకు గాను ప్రముఖ బూట్ల తయారీదారు కంపెనీ ఆడిడాస్‌తో ఒప్పందం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications