నేషనల్ అబ్జర్వర్: మొన్న మేరీ కోమ్... నిన్న సుశీల్ రాజీనామా

హైదరాబాద్: నేషనల్ స్పోర్ట్స్ అబ్జర్వర్ పదవికి డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ బుధవారం రాజీనామా చేశాడు. రెజ్లర్‌గా ఉంటూ అధికార పదవిలో కొనసాగడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుండటంతో సుశీల్ కుమార్ రాజీనామా నిర్ణయం తీసుకున్నాడు.
ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తున్న క్రీడాకారులు ఎవరైనా ఇలాంటి పదవుల్లో ఉండకూడదన్న కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ ఆదేశాలతో ఇప్పటికే స్టార్ బాక్సర్, ఎంపీ మేరీకోమ్ కూడా బాక్సింగ్ పరిశీలకురాలి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
విజయ్ గోయల్ కేంద్ర క్రీడల మంత్రిగా ఉన్న సమయంలో ఒలింపిక్ పతక విజేత అభినవ్ బింద్రా, రెజ్లర్ సుశీల్ కుమార్, బాక్సర్ అఖిల్ సహా 12 మందిని జాతీయ పరిశీలకులుగా నియమించారు. ఇటీవలే
ప్రస్తుతం క్రీడల్లో పాల్గొంటున్న ఎవరైనా క్రీడా పరిశీలకుల పదవిలో కొనసాగకూడదనే నిబంధన ఉందని క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ ఈ పదవికి రాజీనామాలు సమర్పించారు. వీరిద్దరి రాజీమామాను కేంద్ర క్రీడాశాఖ వెంటనే ఆమోదించింది. క్రీడా శాఖ కోరిన వెంటనే పదవికి రాజీనామా చేసినందుకు క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్.. సుశీల్‌కు ధన్యవాదాలు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications