అడిడాస్‌తో ఒప్పందం: హిమదాస్ ఖాతాలో తొలి ఎండార్స్‌మెంట్

హైదరాబాద్: భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్‌ను జర్మన్ స్పోర్ట్స్ క్రీడా పరికరాల సంస్థ అడిడాస్ తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది. ఈ మేరకు మంగళవారం జరిగిన కార్యక్రమంలో అసోంకు చెందిన ఈ స్ప్రింటర్‌తో ఆ సంస్థ ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా 18 ఏళ్ల హిమదాస్‌కు అడిడాస్ కిట్ స్పాన్సర్ చేస్తుంది. దీంతో పాటు ఏడాదిగాను హిమదాస్‌కు రూ. 10 నుంచి రూ. 15 లక్షల వరకు అడిడాస్ కంపెనీ చెల్లించనుంది. అడిడాస్ కంపెనీతో హిమదాస్ చేసుకున్న తొలి ఒప్పందం ఇదే కావడం విశేషం.

హిమదాస్ కోసం ప్రత్యేకంగా ప్రీమియం షూస్
ఈ సందర్భంగా అడిడాస్ కంపెనీ ఆమె కోసమే ప్రత్యేకంగా ప్రీమియం షూస్‌ను తయారు చేసి ఇచ్చింది. ఒక బూటుపై ప్రముఖంగా ‘హిమదాస్' అని, ఇంకో బూటుపై ‘క్రియేట్ హిస్టరీ' అని ముద్రించింది. ఈ బూట్లను అందుకున్న హిమదాస్ మాట్లాడుతూ "అడిడాస్ కుటుంబంలో చేరడం గర్వంగా ఉంది" అని అన్నారు.

అథ్లెట్ల గ్రూపులో భాగమైనందుకు
"అంతర్జాతీయ అథ్లెట్ల గ్రూపులో ఇప్పుడు నేను భాగమైనందుకు ఆనందపడుతున్నా. క్రీడా ప్రపంచంలో ఎంతో మందికి ఈ సంస్థ అండగానిలుస్తోంది. అడిడాస్ స్పాన్సర్‌షిప్‌తో నేను రెట్టించిన ఉత్సాహంతో రాణిస్తా. నా ప్రదర్శనను మెరుగుపర్చుకుంటా" అని హిమదాస్ చెప్పింది.

స్వర్ణం నెగ్గిన తొలి అథ్లెట్‌గా హిమదాస్ చరిత్ర
సెప్టెంబర్‌లో ఫిన్‌లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ అండర్-20 చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచిన భారత అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆగస్టులో ఇండోనేషియా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణంతో పాటు రెండు రజతాలు గెలిచింది.

హిమదాస్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్లను పర్యవేక్షిస్తోన్న ఐఓఎస్ స్పోర్ట్స్ అండ్
ఎంటర్టెన్మెంట్ కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ హిమదాస్ ఖాతాలో ప్రస్తుతం 10 నుంచి 12 వరకు బ్రాండ్లు ఉన్నాయని అన్నారు. ఇందులో ఎనర్జీ డ్రింక్స్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ తదితర బ్రాండ్లు ఉన్నాయని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications