Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కుంబ్లే, బజ్జీ దూకుడు: స్కోరు 526

Anil Kumble
అడిలైడ్: అడిలైడ్ టెస్టులో భారత తొలి ఇన్నింగ్సుకు 526 పరుగుల వద్ద తెర పడింది. కుంబ్లే 87 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత ఆర్పీ సింగ్ క్రీజులోకి వచ్చి డకవుట్ అయ్యాడు. దీంతో భారత తొలి ఇన్నింగ్సుకు తెర పడింది. దూకుడుగా ఆడిన హర్భజన్ (63)ఇన్నింగ్స్‌కు సైమండ్స్ తెరదించడంతో ఆస్ట్రేలియా ఊపిరి పీల్చుకుంది. రెండో రోజు ఆటలో సచిన్ (153), ధోనీ (16)లు నిష్క్రమించినప్పటికీ భారత్ జోరును కొనసాగించిన కుంబ్లే, భజ్జీ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు ఆసీస్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. హర్భజన్ 103 బంతుల్లో ఏడు బౌండరీలతో 63 పరుగులు చేయడం మాత్రమే కాక కుంబ్లేతో కలసి ఎనిమిదో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆర్పీ సింగ్‌ను మైఖేల్ క్లార్క్ బోల్తా కొట్టించాడు.

రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే జాన్సన్ బౌలింగ్‌లో సైమండ్స్‌కు క్యాచ్ ఇవ్వడం ద్వారా ధోనీ (16) పెవిలియన్ బాట పట్టగా, ఆ వెంటనే సచిన్ (153) లీ బౌలింగ్‌లో హాగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాన్సన్ నాలుగు, బ్రెట్‌లీలు మూడు వికెట్లు సాధించగా హాగ్‌, మైఖేల్ క్లార్క్, సైమండ్స్‌లు ఒక్కో వికెట్ పడగొట్టారు. పఠాన్(9), ద్రావిడ్(18), గంగూలీ(7)లు తక్కువ పరుగులకే వెనుతిరిగినప్పటికీ, సచిన్‌తో పాటు సెహ్వాగ్(63), లక్ష్మణ్ (51)లు రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.
Story first published: Friday, January 25, 2008, 12:05 [IST]
Other articles published on Jan 25, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+