Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Bajrang Punia: బజ్‌రంగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియాపై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) విధించిన సస్పెన్షన్‌ను నాడా క్రమశిక్షణ సంఘం (ఏడీడీపీ) తాత్కాలికంగా ఎత్తివేసింది. నాడా తదుపరి నోటీసులు ఇచ్చేవరకు బజరంగ్‌పై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. అసలేం జరిగిదంటే..

మార్చి 10న సోనెపట్‌లో ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో బజ్‌రంగ్ సెమీఫైనల్లో ఓటమిపాలయ్యాడు. అనంతరం అతను డోపింగ్ పరీక్షకు శాంపిల్‌ ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. ఈ విషయమై కన్నేర్ర చేసిన నాడా బజ్‌రంగ్‌పై తాత్కాలిక సస్పెన్షన్ వేటు విధించింది.

ADDP Revokes Bajrang Punia s Suspension Due to Lack of Formal Charges

అయితే డోపింగ్ టెస్టుకు శాంపిల్స్ ఇవ్వడానికి తానెప్పుడూ తిరస్కరించలేదని బజ్‌రంగ్ పునియా ఏడీడీపీకి వివరణ ఇచ్చాడు. పరీక్షల కోసం నాడా అధికారులు గడువు దాటిన కిట్‌లను వాడడంతోనే యూరిన్‌ శాంపిల్‌ ఇచ్చేందుకు నిరాకరించానంటూ తెలిపాడు. అసలు ఎక్స్‌పైరీ అయిన కిట్‌లను ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించానని, కానీ నాడా ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదని ఏడీడీపీతో పేర్కొన్నాడు.

బజరంగ్ పునియా వివరణతో ఏడీడీపీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నాడా తదుపరి నోటీసులు ఇచ్చేదాకా బజ్‌రంగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్టు ఏడీడీపీ తెలిపింది. కాగా, బజరంగ్ పునియా 2020 టోక్నో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. 65 కేజీల విభాగంలో ఫ్రీస్టైల్‌లో మెడల్ సాధించాడు.

Story first published: Tuesday, June 4, 2024, 10:16 [IST]
Other articles published on Jun 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+