Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Achinta Sheuli : భారత్‌కు మూడో స్వర్ణం.. 73కేజీల విభాగంలో రికార్డ్ నెలకొల్పిన వెయిట్ లిఫ్టర్ అచింత షెవులి

Achinta Sheuli Bags Third Gold medal For India, All Medals Are From WeighLifting Only

బర్మింగ్ హామ్ : కామ‌న్వెల్త్ గేమ్స్‌ - 2022లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భారత వెయిట్‌ లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఈ గేమ్స్‌‌లో భారత్ ఇప్పటివరకు 6పతకాలు సాధించగా.. ఆ ఆరు వెయిట్ లిప్టింగ్‌లోనే రావడం గమనార్హం. 73 కేజీల విభాగంలో భారత వెయిట్ లిఫ్టర్ అచింత షెవులి రికార్డు ప్రదర్శనతో స్వర్ణాన్ని ఒడిసిపట్టాడు. స్నాచ్‌లో 143కేజీలు, క్లీన్ అండ్ జ‌ర్క్‌లో 170కిలోలు ఎత్తి భళా అనిపించాడు. మొత్తం 313 కిలోల వెయిట్ లిఫ్ట్ చేసి కామన్‌వెల్త్‌ గేమ్స్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఇక అతని విజయం ఖాయమైన అనంతరం కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్ సంబరాల్లో మునిగి తేలారు. కామ‌న్‌వెల్త్ క్రీడల్లో భారత్‌కు ఇది మూడో స్వర్ణం. ప్రస్తుతం భారత్ పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. తొలిస్థానంలో ఆస్ట్రేలియా 22 గోల్డ్ మెడల్స్‌తో టాప్‌లో కొనసాగుతుంది. 2వ స్థానంలో ఇంగ్లాండ్ 11, 3వ స్థానంలో న్యూజిలాండ్ 10, నాలుగో స్థానంలో సౌతాఫ్రికా 4, 5వ స్థానంలో కెనడా 3బంగారు పతకాలతో భారత్‌ కంటే ముందున్నాయి.

ఇక 73 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో మ‌లేషియాకు చెందిన ఎర్రి హిదాయత్‌ మ‌హ‌మ్మద్‌ 303కేజీల‌ బరువు ఎత్తి రజతం సాధించాడు. అలాగే కెనెడాకు చెందిన షాడ్‌ డార్సిగ్ని 298 కేజీలు ఎత్తి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.

ఇక ఇప్పటివరకు భారత్ తరఫున పతకాలు సాధించిన వారు వీరే..
1. మీరాబాయ్‌ చాను 49కేజీల విభాగంలో గోల్డ్,
2. జెరెమీ లాల్రినుంగా 67కేజీల విభాగంలో గోల్డ్,
3.అచింత షెవులి 73 కేజీల విభాగంలో గోల్డ్,
4. సంకేత్ మహదేవ్ 55 కేజీల విభాగంలో సిల్వర్,
5. బింద్యారాణి దేవీ 55 కేజీల విభాగంలో సిల్వర్,
6. గురురాజ్ పూజారి 61కేజీల విభాగంలో బ్రాంజ్

Story first published: Monday, August 1, 2022, 8:39 [IST]
Other articles published on Aug 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+