100వ టెస్ట్: డివిలియర్స్‌కి దీపావళి కానుక ఇదే
బెంగళూరు: టీమిండియాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం నుంచి ఆరంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్ ద్వారా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ తన టెస్టు మ్యాచ్‌ల సంఖ్యను 100కు పెంచుకోనున్నాడు.

ఈ సందర్భంగా బెంగళూరు ఫుట్ బాల్ క్లబ్(బీఎఫ్‌సీ) డివిలియర్స్‌కు ఓ జెర్సీని దీపావళి కానుకగా బహుకరించింది. 'ఏబీడీ-100' అని ముద్రించి ఉన్న బ్లూ కలర్ జెర్సీని బీఎఫ్‌సీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ముస్తాఫా ఘోష్.. డివిలియర్స్‌కు అందించి సత్కరించారు.
గత కొంతకాలంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో డివిలియర్స్ సభ్యుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, 99 టెస్టులు ఆడిన డివిలియర్స్ 51.93 సగటుతో 7,685 పరుగులను నమోదు చేశాడు. ఇందులో 21 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అటు వన్డేల్లో, ట్వంటీ20ల్లో కూడా డివిలియర్స్ తనదైన ముద్ర వేశాడు. ఈ ఏడాది జనవరిలో జోహన్నెస్ బర్గ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచులో 31 బంతుల్లో వేగవంతమైన సెంచరీ పూర్తి చేసిన డివిలియర్స్.. గత ఆగస్టులో ఎనిమిది వేల వన్డే పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. కాగా, ప్రస్తుతం అంతర్జాతీయ టెస్ట్, వన్డే బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో డివిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications